Site icon NTV Telugu

Most Ducks in IPL: చెత్త రికార్డ్ కోసం రోహిత్ శర్మ-దినేశ్ కార్తీక్ పోటీ

Dinesh Rohit

Dinesh Rohit

టీమిండియా ఆటగాళ్లు హిట్ మ్యాచ్ రోహిత్ శర్మ.. దినేశ్ కార్తీక్ లు ఓ విషయంలో పోటీపడుతున్నారు. దీన్ని చూస్తున్న అభిమానులు మాత్రం వీరిద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేంటీ పోటీ మంచిదేగా అంటారా..? అస్సలు విషయం ఏమిటంటే.. ప‌రుగుల విష‌యంలో పోటీప‌డితే బాగానే ఉంటుంది కానీ వీరు ఓ చెత్త రికార్డు కోసం పోటీపడుతున్నారు.

Also Read : Boating Asifabad : చుట్టూ అడవి.. మధ్యలో బోటు షికారు.. ఎక్కడో కాదు..

ఐపీఎల్ లో రోహిత్ శ‌ర్మ ముంబై ఇండియ‌న్స్‌కు సారథిగా ఉండగా.. దినేశ్ కార్తిక్ ఆర్సీబీ తరపున ఆడుతున్నాడు. ఆదివారం జైపూర్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో దినేశ్ కార్తిక్ డ‌కౌట్ అయ్యాడు. రెండు బంతులు ఎదుర్కొన్న దినేశ్ కార్తీక్.. ఆడమ్ జంపా బౌలింగ్‌లో ఎల్భీగా పెవిలియన్ బాట పట్టాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో ఎక్కువ సార్లు డ‌కౌట్ అయిన లిస్ట్ లో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉండగా తాజాగా దినేశ్ కార్తీక్ చేరాడు. ప్రస్తుతం ఈ ఇద్దరు సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నారు.

Also Read : Nehal Vadhera : వెరైటీ శిక్ష అనుభవించిన ముంబై బ్యాటర్

ఈ ఇద్దరు ఇప్పటి వ‌ర‌కు ఐపీఎల్‌లో 16 సార్లు డ‌కౌట్లు అయ్యారు. వీరి త‌రువాత 15 డకౌట్లతో మ‌న్‌దీప్ సింగ్‌, సునీల్ న‌రైన్‌లు కొనసాగుతున్నారు. దినేశ్ కార్తిక్ డ‌కౌట్ విష‌యంలో ఆర్‌సీబీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత సీజ‌న్‌లో ఫినిష‌ర్‌గా అద‌ర‌గొట్టిన కార్తీక్.. ఈ సీజ‌న్‌లో రోహిత్‌తో డ‌కౌట్ల విష‌యంలో పోటీప‌డుతూ జ‌ట్టుకు భారంగా మారుతున్నాడు అంటూ విమర్శిస్తున్నారు. ఈ సీజ‌న్‌లో ఇప్పటి వరకు 11 ఇన్నింగ్స్‌ల్లో దినేశ్ కార్తీక్ 140 ప‌రుగులు మాత్రమే చేశాడు. డీకే అత్యధిక స్కోర్ 30 పరుగులు మాత్రమే.

Exit mobile version