Dhoni chants: టీమిండియా మాజీ కెప్టెన్, కెప్టెన్ కూల్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ థాలా.. ఇవీ మహేంద్ర సింగ్ ధోనీ పేర్లు. ఎంఎస్‌కి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్‌లో ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. ఈ సీజన్‌లో సూపర్ బ్యాటింగ్‌తో ఫినిషర్ పాత్రను సమర్ధవంతంగా పోషిస్తున్నాడు. బుధవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో ఆఖరిలో బ్యాటింగ్ కు వచ్చిన చెన్నై కెప్టెన్ 9 బంతుల్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్ తో 20 పరుగులు చేశాడు.
Read also: TS SSC Results: టెన్త్ పేపర్ లీకేజీ కేసు.. హోల్డ్ లో డీబార్ అయిన విద్యార్థి హరీష్ ఫలితాలు
ధోనికి అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సీజన్‌లో అయితే అది మరీ ఎక్కువైంది. ధోనీని చూసేందుకు అభిమానులు స్టేడియంకు పరుగులు పెడుతున్నారు. ఒక్క చెన్నైలోనే కాదు దేశంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా ఇదే పరిస్థితి. ధోనీ సిక్సర్ కొట్టడం కాదు.. మైదానంలోకి అడుగు పెట్టగానే.. స్టేడియం అరుపులతో మారుమోగుతోంది. అలా సిక్సర్లు కొడితే ఫ్యాన్స్ ఊరుకుంటారా అస్సలు ఉండలేరు. బుధవారం మ్యాచ్‌లో జరిగిన సంఘటనే అందుకు నిదర్శనం. సాధారణంగా ఓవర్ పూర్తయిన తర్వాత, వికెట్ పడినప్పుడు, విరామ సమయంలో ప్రకటనలను ప్రసారం చేస్తారు. తద్వారా వారికి కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది. కానీ రాయుడు అవుట్ అయిన తర్వాత ధోనీ స్టేడియంలో ఎంట్రీ ఇచ్చే టైంలో ఆ ప్రసారాలు అస్సలు కనిపించలేదు. ధోనీ డగౌట్ నుంచి క్రీజులోకి వచ్చే వరకు ధోనీనే చూపించారు. ధోనీ క్రేజ్‌తో బ్రాడ్‌కాస్టర్లు కోట్లాది రూపాయల ఆదాయాన్ని వదులుకున్నారని నెటిజన్లు పోస్ట్‌లు చేస్తున్నారు.
అంతేకాదు ధోని బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జియో సినిమా చూసే వారి సంఖ్య భారీగా నమోదైంది. జియో సినిమా ద్వారా ధోని బ్యాటింగ్‌ను 80 లక్షల మంది వీక్షించారు. గతంలో 1.7 కోట్ల మంది వీక్షకుల రికార్డును ఈ మ్యాచ్ బద్దలు కొట్టింది. ఇవన్నీ ఒకెత్తయితే.. ధోనీ డై హార్డ్ ఫ్యాన్స్.. బుధవారం నాటి మ్యాచ్‌లో తమ ప్రేమను మరో స్థాయిలో చూపించారు. ధోనీ బ్యాటింగ్ చేస్తుండగా స్టేడియంలో ఉన్న వేలాది మంది అభిమానులు ఏకంగా ధోనీ.. ధోనీ.. ధోనీ అంటూ కేకలు వేశారు. ధోని సిక్సర్లు కొట్టడంతో స్టేడియం అభిమానుల కేకలు, విజల్స్‌తో మారుమోగింది. అదికూడా ఎంతగా అంటే ఇంకాస్త పెరిగితే చెవులు వినపడని పరిస్థితి పోయేంతగా. స్టేడియంలోని ఓ అభిమాని చేతిలో ఉన్న స్మార్ట్ వాచ్ ఈ విషయాన్ని చెప్పింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి.
Weather: తీవ్ర తుఫానుగా మోచా.. తెలుగు రాష్ట్రాలపై ఎఫెక్ట్