NTV Telugu Site icon

DC vs PBKS: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

Dc Vs Pbks

Dc Vs Pbks

Delhi Capitals Won The Toss And Chose To Field Against PBKS: ఐపీఎల్ 2023 సీజన్‌లో శనివారం ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్‌లో ఇది 59వ మ్యాచ్. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో డీసీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. బ్యాటింగ్ చేసేందుకు పంజాబ్ కింగ్స్ రంగంలోకి దిగింది. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా 11 మ్యాచ్‌లు ఆడి కేవలం నాలుగింటిలో విజయం సాధించిన డీసీకి.. ప్లేఆఫ్స్ ఆశలు దాదాపు సన్నగిల్లాయి. కానీ.. పంజాబ్ కింగ్స్‌కి మాత్రం ఈ మ్యాచ్ అత్యంత కీలకమైనది. ఎందుకంటే.. 11 మ్యాచ్‌ల్లో ఐదు గెలిచిన పంజాబ్‌కు ఫ్లేఆఫ్స్‌కు వెళ్లే అవకాశాలు ఇంకా ఉన్నాయి. మంచి రన్ రేట్‌తో అది వరుస విజయాలు నమోదు చేస్తే.. ప్లేఆఫ్స్‌కి వెళ్లే ఛాన్స్ ఉంది. కాబట్టి.. పంజాబ్‌కి ఈ మ్యాచ్ చాలా ప్రతిష్టాత్మకమైంది. ఈ సీజన్‌లో ఈ ఇరు జట్లు తలపడుతుండటం ఇదే మొదటిసారి. కాబట్టి.. ఎవరు ఎవరిపై ఆధిపత్యం చెలాయిస్తారన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Dinesh Gundurao : 105 ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి గుండూరావు

నిజానికి.. ఢిల్లీ జట్టులో విధ్వంసకర బ్యాటర్లు ఉన్నప్పటికీ, మొదట్లో వాళ్లు పెద్దగా సత్తా చాటలేకపోయారు. అందుకే.. వరుసగా ఐదు పరాజయాలు చవిచూడాల్సి వచ్చింది. కానీ.. ఎప్పుడైతే వాళ్లు తిరిగి ఫామ్‌లోకి వచ్చారో, అప్పటి నుంచి డీసీ దశ తిరిగింది. కానీ.. దురదృష్టవశాత్తూ గత కీలక మ్యాచ్‌లో ఓటమిపాలైంది. దీంతో.. ప్లేఆఫ్స్ ఆశలు వదులుకోవాల్సి వచ్చింది. అయితే.. తనకు దక్కనిది మరెవ్వరికీ దక్కకూడదన్న ఉద్దేశంతో, అవకాశం ఉన్న ఇతర జట్ల ప్లేఆఫ్స్ ఆశల్ని నీరుగార్చాలని భావిస్తోంది. అటు, పంజాబ్ కింగ్స్‌లోనూ మంచి బ్యాటర్లు ఉన్నారు కానీ, నిలకడగా రాణించడం లేదు. ఎవరో ఒకరు అప్పుడప్పుడు మెరుపులు మెరిపిస్తున్నారే తప్ప.. అందరూ సమిష్టిగా ఆడటం లేదు. ఇప్పుడు ఈ మ్యాచ్ చాలా కీలకం కాబట్టి.. పంజాబ్ ఆటగాళ్లు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటాల్సి ఉంటుంది. మరి.. పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించి, ఆ జట్టు ప్లేఆఫ్స్ ఆశల్ని డీసీ బుగ్గిపాలు చేస్తుందా? లేక పంజాబ్ రివర్స్‌లో డీసీని మట్టికరిపిస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ!

Show comments