NTV Telugu Site icon

DC vs PBKS: ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పంజాక్ కింగ్స్ పరాజయం

Dc Won The Match

Dc Won The Match

Delhi Capitals Won The Match By 15 Runs Against Punjab Kings: ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పంజాయ్ కింగ్స్ పరాజయం పాలైంది. డీసీ నిర్దేశించిన 214 పరుగుల లక్ష్యాన్ని పీబీకేఎస్ ఛేధించలేకపోయింది. 198 పరుగులకే పరిమితం అయ్యింది. దీంతో.. ఢిల్లీ క్యాపిటల్స్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. తమ జట్టుని గెలిపించుకోవడం కోసం లియామ్ లివింగ్‌స్టన్ (48 బంతుల్లో 94), అథర్వా (42 బంతుల్లో 55) కలిసి గట్టిగానే పోరాడారు కానీ.. ఫలితం లేకుండా పోయింది. ఆ ఇద్దరు మినహాయించి మిగతా బ్యాటర్లందరూ చేతులు ఎత్తేయడం వల్ల.. పంజాబ్ కింగ్స్‌కి ఈ ఓటమి తప్పలేదు.

Naresh: పెళ్లి చేసుకున్నవారు ఎవరు హ్యాపీగా లేరు.. మేము పెళ్లి చేసుకోలేదు

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. రుస్సో (37 బంతుల్లో 82) విలయతాండవం చేయడం, పృథ్వీ షా (38 బంతుల్లో 54) అర్థశతకంతో రాణించడం, డేవిడ్ వార్నర్ (31 బంతుల్లో 46)తో పాటు ఫిల్ సాల్ట్ (14 బంతుల్లో 26) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో.. ఢిల్లీ జట్టు అంత భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులకు తట్టాబుట్టా సర్దేసింది. ఆరంభంలో పంజాబ్ కింగ్స్ చాలా చెత్త ప్రదర్శన కనబర్చింది. ఇలాంటి బ్యాటింగ్ పిచ్‌లో తొలి ఓవర్ మెయిడెన్‌గా ముగిసిందంటే, మీరే అర్థం చేసుకోండి. ఆ వెంటనే గబ్బర్ ఔట్ అవ్వడంతో.. పంజాబ్ జట్టుపై ఒత్తిడి పడింది. ఆ తర్వాత పంజాబ్ మెల్లగా దూకుడు పెంచింది. సరిగ్గా 50 పరుగుల వద్ద మరో వికెట్ పడింది.

Krithi Shetty: ‘ఉప్పెన’ తరువాత ప్లాస్టిక్ సర్జరీ.. బేబమ్మ ఏం చెప్పిందంటే..?

అప్పుడు క్రీజులోకి వచ్చిన లియామ్ లివింగ్‌స్టన్.. ఢిల్లీ బౌలర్లతో చెడుగుడు ఆడుకోవడం మొదలుపెట్టాడు. రావడం రావడంతోనే అతడు తన బ్యాట్‌కి పనిచెప్పడం మొదలుపెట్టారు. అథర్వా కూడా ఊపందుకున్నాడు కానీ, అతడు బంతులు కూడా వృధా చేస్తూ వచ్చాడు. కానీ.. లివింగ్‌స్టన్ మాత్రం సాధ్యమైనంతవరకూ పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించాడు. భారీ షాట్లతో ఆ మైదానాన్ని హోరెత్తించేశాడు. చివరి బంతి వరకు తన జట్టుని విజయతీరాలకు చేర్చేందుకు కష్టపడ్డాడు. కానీ.. ఇతర బ్యాటర్లే చేతులెత్తేశారు. 128 పరుగుల వద్ద అథర్వా పోయాక.. మిగతా బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఎవ్వరూ క్రీజులో ఎక్కువసేపు నిలబడలేకపోయారు. దీంతో.. లివింగ్‌స్టన్ పడ్డ కష్టం బురదలో పోసిన పన్నీరు అయిపోయింది.