NTV Telugu Site icon

SRH vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో సన్‌రైజర్స్ ఘోర పరాజయం

Dc Won Match

Dc Won Match

Delhi Capitals Won By 7 Runs On Sunrisers Hyderabad: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఘోర పరాజయం చవిచూసింది. ఆ జట్టు నిర్దేశించిన 145 పరుగులు స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేధించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులకే పరిమితం అయ్యింది. దీంతో.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 7 పరుగుల తేడాతో గెలుపొందింది. సన్‌రైజర్స్‌లోని స్టార్ ఆటగాళ్లందరూ చేతులెత్తేయడం.. లక్ష్యం చిన్నదే కావడంతో మొదటి నుంచి నిర్లక్ష్యంగా ఆడటంతో.. ఎస్ఆర్‌హెచ్ ఈ ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది.

Neha Sharma: ఎద అందాలు దాచినా దాగనట్టున్నాయే..

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. మనీశ్ పాండే (34), అక్షర్ పటేల్ (34) ఆశాజనకమైన ఇన్నింగ్స్‌తో నెట్టుకురావడం.. అంతకుముందు డేవిడ్ వార్నర్ (21), మిచెల్ మార్ష్ (25) పర్వాలేదనిపించడంతో.. ఢిల్లీ జట్టు ఆ స్థాయి స్కోరు చేయగలిగింది. ఇక 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ జట్టు.. ఆది నుంచే నిదానంగా ఆడుతూ వచ్చింది. వీలు చిక్కినప్పుడల్లా మయాంక్ అగర్వాల్ ఫోర్లు కొట్టాడు కానీ, బ్రూక్ మాత్రం దారుణ ప్రదర్శన కనబర్చాడు. అతడు 14 బంతుల్లో 7 పరుగులే చేసి ఔట్ అయ్యాడు. అతని తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి ఏమైనా మ్యాజిక్ చేశాడా అంటే.. అతడు కూడా నిరాశపరిచాడు. 21 బంతులాడిన అతగాడు కేవలం 15 పరుగులే చేశాడు. కెప్టెన్ మార్ర్కమ్ కూడా 3 పరుగులకే జెండా ఎత్తేశాడు. టాపార్డర్‌లో ఎవరైనా బాగా రాణించారంటే.. అది మయాంక్ అగర్వాల్ (49) ఒక్కడే. పాపం.. అతడు ఒక్క పరుగు తేడాతో అర్థశతకం కోల్పోయాడు.

Crime News: దుర్మార్గుడా.. ఎంత పని చేశావ్ రా.. ప్రేమించలేదని నడిరోడ్డుపై

టాపార్డర్ ఘోరంగా విఫలం అవ్వడంతో.. చివర్లో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. 5 ఓవర్లలో 56 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు క్రీజులో ఉన్న క్లాసెన్, సుందర్.. కాసేపు మెరుపులు మెరిపించారు. ముఖ్యంగా క్లాసెన్ అయితే దుమ్ముదులిపేశాడు. అతడు ఆడిన ఆటతీరు చూసి.. సన్‌రైజర్స్ విజయం తథ్యమని అంతా భావించారు. కానీ.. 31 వ్యక్తిగత పరుగుల వద్ద అతడు క్యాచ్ ఔట్ అయ్యాడు. ఇక చివరి ఓవర్‌లో 13 పరుగులు చేయాల్సి ఉండగా.. ముకేశ్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. భారీ షాట్లు బాదే అవకాశమే ఇవ్వలేదు. కేవలం ఐదంటే ఐదు పరుగులే ఇచ్చాడు. దీంతో.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయఢంకా మోగించింది. ఢిల్లీ బౌలర్లలో నోర్ట్యే, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు తీయగా.. ఇషాంత్ శర్మ, కుల్దీప్ యాదవ్‌లు చెరో వికెట్ పడగొట్టారు.

Show comments