DC vs PBKS: చావో.. రేవో.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే..?

Marsh

Marsh

ఐపీఎల్‌లో డీవై పాటిల్ స్టేడియం వేదికగా పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ ముందు 160 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఢిల్లీ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ 63, సర్ఫరాజ్ ఖాన్ 32, లలిత్ యాదవ్ 24 పరుగులతో రాణించారు. పంజాబ్ బౌలర్లలో లివింగ్ స్టోన్, అర్ష్ దీప్ సింగ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. రబాడ ఓ వికెట్ సాధించాడు. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఇరుజట్లకు ఇది చావో.. రేవో మ్యాచ్ లాంటిది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లే అవకాశం ఉంది. కాబట్టి ఇరుజట్లకు ఇది కీలక మ్యాచ్ అనే చెప్పాలి.

Cricket: మహిళల ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది