Site icon NTV Telugu

IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో మరోసారి కరోనా కలకలం

Delhi Capitals

Delhi Capitals

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో మరోసారి కరోనా వైరస్ కలకలం రేగింది. ఆ జట్టులోని ఓ నెట్ బౌలర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ జట్టు ఆటగాళ్లందరినీ ఐసోలేషన్‌లో ఉంచినట్లు నిర్వాహకులు ప్రకటించారు. అయితే ఢిల్లీ జట్టులో ఇప్పటికే పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఆదివారం రాత్రి జరగాల్సిన మ్యాచ్‌పై సందిగ్ధత నెలకొంది.

కాగా ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కరోనా సోకడం ఇది రెండోసారి. గతంలో జట్టు ఫిజియో ప్యాట్రిక్ ఫర్హాత్‌ సహా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్, కీపర్ టిమ్ సీఫర్ట్ సహా ముగ్గురు సహాయ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. అయితే అప్పుడు ఆటగాళ్లకు నెగిటివ్ రావడంతో ఆయా మ్యాచ్‌లను యథావిథిగా నిర్వహించారు. ఇప్పుడు నెట్ బౌలర్ ద్వారా వేరే ఆటగాళ్లకు కరోనా సోకి ఉంటుందా అనే అనుమానాలు ఢిల్లీ యాజమాన్యాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

Cricket: బీసీసీఐపై యువరాజ్ సంచలన ఆరోపణలు

Exit mobile version