ఐపీఎల్ సంబరం మరో రెండు రోజుల్లో ప్రారంభం కాబోతుంది. దీంతో క్రికెట్ అభిమానులు ఐపీఎల్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రెండేళ్ల తర్వాత భారత్‌లో పూర్తిస్థాయిలో ఐపీఎల్ జరగనుంది. దీంతో ఈ ఏడాది ట్రోఫీ ఎవరు గెలుస్తారు అన్న చర్చ మొదలైంది. టైటిల్ ఫేవరేట్స్‌గా చెన్నై సూపర్‌కింగ్స్, ముంబై ఇండియన్స్ బరిలోకి దిగుతున్నాయి. ఈ సీజన్‌లో కొత్తగా దిగుతున్న గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్‌జెయింట్స్ జట్లపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు.
అయితే ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ ఎవరు గెలుస్తారో లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ చెప్పేశాడు. రిషబ్ పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఏడాది ఐపీఎల్ ఛాంపియన్‌గా అవతరిస్తుందని సన్నీ జోస్యం చెప్పాడు. రిషబ్ పంత్ ఫామ్ ఢిల్లీ జట్టుకు ప్లస్ అవుతుందని అభిప్రాయపడ్డాడు. ఇటీవల జరిగిన మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ విన్నర్లను కొనుగోలు చేసిందన్నాడు. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, శార్దూల్ ఠాకూక్, ఎంగిడి, రోవ్‌మెన్ పావెల్ వంటి ఆటగాళ్లు ఢిల్లీ జట్టుకు బలంగా నిలుస్తారని సునీల్ గవాస్కర్ చెప్పాడు.
