NTV Telugu Site icon

ఆ ఓపెనర్ ను 3వ స్థానంలో ఆడించాలి అంటున్న మాజీ కీపర్…

భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్ డ్రా గా ముగిసిన విషయం తెలిసిందే. అయితే డిసెంబరు 3 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ గురించి బీవహారథ మాజీ వికెట్ కీపర్ దీప్ దాస్‌గుప్తా మాట్లాడుతూ.. జట్టులో చేయాల్సిన కొన్ని మార్పులను సూచించాడు. ఈ రెండో టెస్టులో బౌలర్ ఇషాంత్ శర్మ స్థానంలో పేసర్ మహ్మద్ సిరాజ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంచి అని చెప్పాడు. అలాగే మన బ్యాటింగ్ లైనప్‌ పై మాట్లాడుతూ… ఓపెనర్ మయాంక్ అగర్వాల్ మన పిచ్‌లపై స్పిన్‌ ను బాగా ఆడుతాడు. కాబట్టి అతడిని మూడో స్థానంలో బ్యాటింగ్ కు తీసుకురావచ్చని చెప్పాడు. అలాగే భవిష్యత్తులో భారత్‌ కు ఈ సుదీర్ఘమైన ఫార్మాట్‌ లో మిడిల్ ఆర్డర్ బలంగా ఉండాలంటే… శుభ్‌మన్ గిల్‌ను ఆ స్థానంలో ఎంచుకోవచ్చని దీప్ దాస్‌గుప్తా అభిప్రాయపడ్డాడు.