Site icon NTV Telugu

IPL 2022: డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు

David Warner

David Warner

గురువారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ అరుదైన ఘనతను నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతాపై వార్నర్ 26 బంతుల్లో 8 ఫోర్లు సహాయంతో 42 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో కోల్‌కతా జట్టుపై అతడు వెయ్యి పరుగుల మార్కును అందుకున్నాడు. దీంతో ఐపీఎల్‌ చరిత్రలో రెండు జట్లపై వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి ఆలగాడిగా వార్నర్ రికార్డు సృష్టించాడు. గతంలో పంజాబ్‌పై ఓవరాల్ ఐపీఎల్‌లో వార్నర్ 22 ఇన్నింగ్స్‌లలో 1,005 పరుగులు చేశాడు. తాజాగా కోల్‌కతాపై చేసిన 42 పరుగులతో కలిపి వార్నర్ 26 మ్యాచ్‌లలో 1,008 పరుగులు పూర్తి చేశాడు.

గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున వార్నర్ ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఈ ఏడాది మెగా వేలానికి ముందు ఆ జట్టు వార్నర్‌ను రిటైన్ చేసుకోలేదు. గత ఏడాది ఐపీఎల్‌లో జరిగిన పరిణామాల నేపథ్యంలో వార్నర్ కూడా సన్‌రైజర్స్ జట్టుకు ఆడటాన్ని ఇష్టపడలేదు. దీంతో అతడు మెగా వేలంలోకి రాగా.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో ఢిల్లీ తరఫున ఐదు మ్యాచ్‌లు ఆడిన వార్నర్ ఇప్పటివరకు 219 పరుగులు చేశాడు. అతడి సగటు 54.75గా నమోదైంది. ఐదు మ్యాచ్‌లలో మూడు హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం.

Exit mobile version