NTV Telugu Site icon

David Warner: వార్నర్ సంచలన ప్రకటన.. 2024లో గుడ్‌బై

David Warner Retire

David Warner Retire

David Warner To Retire From Cricket After 2024 T20 World Cup: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తాజాగా సంచలన ప్రకటన చేశాడు. వచ్చే ఏడాది సమ్మర్ సీజన్‌లో తాను టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకోబోతున్నానని పేర్కొన్నాడు. జనవరి సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరగబోయే టెస్టు సిరీసే తనది ఆఖరిదని అతడు కుండబద్దలు కొట్టాడు. అంతేకాదు.. 2024 టీ20 వరల్డ్‌కప్ తనకు ఆస్ట్రేలియా తరఫున చివరి టోర్నీ అవుతుందని బాంబ్ పేల్చాడు. ‘‘నేను ఇంతకుముందు చెప్పినట్టుగా.. 2024 టీ20 వరల్డ్ కప్ నా ఫైనల్ గేమ్ అవుతుంది. ఈ విషయంపై నేను ఇప్పటికే నా కుటుంబ సభ్యులతో మాట్లాడాను. నేను నా టెస్టు కెరీర్‌ని హోమ్‌గ్రౌండ్‌లో (సిడ్నీ) పాకిస్తాన్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌తో ముగించాలని నిర్ణయించుకున్నాను. ఒకవేళ నేను డబ్ల్యూటీసీ, యాషెస్ సిరీస్‌లో బాగా రాణించగలిగితే.. పాకిస్తాన్ సిరీస్‌తో టెస్టు కెరీర్‌కి గుడ్‌బై చెప్తా. ఒకవేళ ఆ రెండు సిరీస్‌లలో బాగా రాణించకపోతే.. పాకిస్తాన్ సిరీస్‌దాకా ఉంటానో లేదో చెప్పలేను. కానీ.. వెస్టిండీస్ సిరీస్ అయితే నేను కచ్ఛితంగా ఆడను’’ అంటూ వార్నర్ చెప్పుకొచ్చాడు.

WTC Final: WTC ఫైనల్‌లో భారత్ గెలిస్తే.. ఆ ఘనత సాధించిన తొలిజట్టుగా సరికొత్త చరిత్ర

కాగా.. 2011లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌తో డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఆ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 3, రెండో ఇన్నింగ్స్‌లో 12 పరుగులు చేసిన వార్నర్.. రెండో టెస్టులో మాత్రం సెంచరీ చేసి, తన స్థానాన్ని పదిలపర్చుకున్నాడు. అప్పటి నుంచి అతని కెరీర్ దిగ్విజంగా సాగింది. తన కెరీర్‌లో 102 టెస్టులు ఆడిన వార్నర్.. 45.58 సగటుతో 8158 పరుగులు చేశాడు. అందులో ఒక ట్రిపుల్ సెంచరీ, మూడు డబుల్ సెంచరీలతో పాటు 25 సెంచరీలు బాదాడు. బౌలింగ్‌లోనూ అతగాడు 4 వికెట్లు తీశాడు. అతని కెరీర్ సాఫీగా సాగుతున్న సమయంలో.. 2018లో బాల్ ట్యాంపరింగ్ వివాదంలో అతడు చిక్కుకున్నాడు. ఏడాది పాటు నిషేధానికి గురయ్యాడు. ఇదే వ్యవహారంలో స్టీవ్ స్మిత్ కూడా ఏడాది పాటు నిషేధానికి గురయ్యాడు కానీ, వార్నర్‌పై మాత్రం క్రికెట్ ఆస్ట్రేలియా జీవితంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టకుండా జీవితకాల నిషేధం విధించింది. దీనిపై అతడు పిటిషన్ దాఖలు చేశాడు కానీ, క్రికెట్ ఆస్ట్రేలియా సరిగ్గా స్పందించకపోవడంతో దాన్ని విరమించుకున్నాడు.

Odisha Train Accident: 3 రైళ్లు ఒకదానికొకటి ఎలా ఢీకొన్నాయో తెలుసా..?