David Warner Shocking Comments on Cricket Australia: డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌ల బాల్ టాంపరింగ్ వ్యవహారం గుర్తుందా? ఈ ఉదంతంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఆ ఇద్దరిపై కఠిన శిక్షలు విధించింది. రెండేళ్ల పాటు నిషేధం విధించింది. అయితే.. వార్నర్ విషయంలో మరో క్రికెట్ ఆస్ట్రేలియా మరో సంచలన నిర్ణయం కూడా తీసుకుంది. అతడి కెప్టెన్సీపై జీవితకాల బ్యాన్ విధించింది. స్టీవ్ స్మిత్‌పై మాత్రం అలాంటి చర్యలు తీసుకోలేదు. అతడు మళ్లీ జట్టుకి వైస్ కెప్టెన్ అయ్యాడు. అంతేకాదు.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గైర్హాజరులో జట్టుకి నాయకత్వ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నాడు. ఇలా స్మిత్ పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా సున్నితంగా ఉండటం, తన కెప్టెన్సీపై జీవితకాలం బ్యాన్ విధించడంతో నొచ్చుకున్న డేవిడ్ వార్నర్.. తన కెప్టెన్సీ బ్యాన్‌పై గతేడాది నవంబర్‌లో రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేశాడు. దీంతో.. ఆ పిటిషన్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీని నియమించింది. అయితే.. ఈ కేసుని బహిరంగంగా విచారణ చేపట్టాలని ఆ కమిటీ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో అసంతృప్తి చెందిన వార్నర్.. చివరికి తన రివ్యూ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నాడు.
Khiladi Lady: కి‘లేడీ’.. అధిక వడ్డీ ఆశ చూపి రూ.41 లక్షలు స్వాహా
ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అతడు క్రికెట్ ఆస్ట్రేలియాపై ఫైర్ అయ్యాడు. తన పట్ల ఆస్ట్రేలియా బోర్డు వ్యవహరిస్తున్న తీరు హాస్యాస్పదంగా ఉందంటూ మండిపడ్డాడు. తాను గతాన్ని మార్చిపోవాలని భావిస్తుంటే.. బోర్డు వారు మాత్రం ఇంకా ఆ ఇష్యూని కొనసాగించాలనే ఉద్దేశ్యంతోనే ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరూ జవాబుదారీగా ఉండకూడదని, ఎవరూ నిర్ణయం తీసుకోకూడదని వాళ్లు అనుకున్నారంటూ అసంతృప్తి వ్యక్తపరిచారు. క్రికెట్ ఆస్ట్రేలియాలో నాయకత్వ లోపం సృష్టంగా కన్పిస్తోందంటూ కుండబద్దలు కొట్టాడు. ఇదే విషయంపై తాను టెస్టు మ్యాచ్‌లు ఆడే సమయంలో తనకు పదే పదే ఫోన్ కాల్స్ వచ్చేవని.. అప్పుడు తాను లాయర్లతో మాట్లాడేవాడినని.. అది తన ఏకాగ్రతను దెబ్బతీసిందని వాపోయాడు. ఇదంతా తనకు ఆగౌరవంగా అనిపించిందని.. అందుకే గతాన్ని మర్చిపోవాలని భావిస్తున్నానని తెలిపాడు. ఈ కథంతా గతేడాది ఫిబ్రవరిలో ప్రారంభమైందన్న వార్నర్.. ఈ విషయంపై తాను తీవ్ర నిరుత్సాహానికి గురయ్యానని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాద ప్రదేశానికి ప్రధాని మోడీ