David Warner Fined: మనుషులన్నాక తప్పులు చేయడం సహజమే! కొందరు కావాలనే తప్పులు చేయరు. అనుకోకుండా జరిగిపోతాయంతే! డేవిడ్ వార్నర్ కూడా తెలిసో తెలియకో ఒక తప్పు చేశాడు. అందుకు అతనికి భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా రూ.12 లక్షలు ఫైన్ కట్టాల్సి వచ్చింది. ఇంతకు.. అతను చేసిన తప్పేంటి? ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడిన మ్యాచ్‌లో.. ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపొందిన విషయం తెలిసిందే! ఈ మ్యాచ్ చాలా కీలకం కావడంతో, ఢిల్లీ జట్టు ఆచితూచి బౌలింగ్ వేసింది. ప్రణాళికబద్దంగా కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన బౌలర్లతో బౌలింగ్ వేయించాడు. అయితే.. పరిమిత సమయంలో నిర్ణీత 20 ఓవర్లు వేయించడంలో అతడు విఫలమయ్యాడు. దీంతో.. స్లో ఓవర్‌రేట్ కారణంగా వార్నర్‌కు ఐపీఎల్ నిర్వాహకులు జరిమానా విధించారు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు గాను.. వార్నర్‌కు రూ. 12 లక్షలు జరిమానా విధించినట్టు ఐపీఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇది తొలి తప్పిదం కావడంతో.. జరిమానాతో సరిపెట్టింది. ఒకవేళ ఇదే తప్పు రెండోసారి రిపీట్ అయితే మాత్రం.. ఢిల్లీ కెప్టెన్ వార్నర్‌పై నిషేధం పడనుంది. కాబట్టి.. అతడు తదుపరి మ్యాచ్‌ల్లో బౌలింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
Alcohol Consuming Coutries: ఈ దేశాల్లో మందుబాబులు ఎక్కువ
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 7 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే! తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. అనంతరం 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులకే పరిమితం అయ్యింది. నిజానికి.. లక్ష్యం చిన్నదే కావడంతో, ఎస్ఆర్‌హెచ్ జట్టు సునాయాసంగా లక్ష్యాన్ని ఛేధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ.. అనూహ్యంగా హైదరాబాద్ బ్యాటర్లు చేతులు ఎత్తేయడంతో ఓటమి తప్పలేదు. మయాంక్ అగర్వాల్ 49 పరుగులతో మొదట్లో నెట్టుకురాగా.. చివర్లో మ్యాచ్ గెలిపించేందుకు క్లాసెన్, సుందర్ గట్టిగానే ప్రయత్నించారు. చివరి ఓవర్‌లో 13 పరపుగులు చేయాల్సి ఉన్నప్పుడు.. ముకేశ్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ వేసి, కేవలం ఐదు పరుగులే ఇచ్చాడు. దీంతో.. సన్‌రైజర్స్ జెండా ఎత్తేయాల్సి వచ్చింది. ఒకవేళ ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లలో ఎవరో ఒకరు మొదటి నుంచే కాస్త దూకుడుగా ఆడి ఉంటే, ఈ మ్యాచ్ సొంతం అయ్యేది. కానీ.. అందరూ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో, గెలవాల్సిన మ్యాచ్‌ని చేజార్చుకున్నారు.
