Site icon NTV Telugu

Ind vs SA: భారత్ లక్ష్యం 250.. అర్థశతకాలు బాదిన మిల్లర్, క్లాసెన్‌

India Vs South Africa

India Vs South Africa

Ind vs SA: లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి వన్డేలో టీమిండియా ముంగిట భారీ లక్ష్యాన్ని ఉంచారు. 40 ఓవర్‌లో భారత్ 250 పరుగులు చేయాల్సి ఉంది. డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్ 5వ వికెట్‌కు ఘన భాగస్వామ్యాన్ని నెలకొల్పగా.. దక్షిణాఫ్రికా 40 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేయగలిగింది. నేడు వర్షం కారణంగా మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. డేవిడ్ మిల్లర్ (75), హెన్రిచ్ క్లాసెన్ (74) అజేయ అర్ధ సెంచరీలతో దక్షిణాఫ్రికా స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఐదో వికెట్ భాగ‌స్వామ్యానికి డేవిడ్ మిల్లర్‌, హెన్రిచ్ క్లాసిన్ 139 ప‌రుగులు జ‌త చేశారు. డికాక్ ఔటైన త‌ర్వాత దూకుడుగా ఆడిన క్లాసెన్ ప‌రుగుల వేగం పెంచాడు.

Airtel 5G: ఎయిర్​టెల్ 5జీ సేవలు షురూ.. 30 రెట్లు అధిక వేగంతో నెట్

బౌలర్లు కట్టుదిట్టంగా బంతులను సంధించినా క్యాచ్‌లను చేజార్చడం టీమ్ఇండియా పాలిట శాపమైంది. ఫ‌లితంగా మిల్లర్‌, క్లాసెన్‌ల‌కు ప‌లు ద‌ఫాలు లైఫ్‌లైన్లు ల‌భించాయి. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2.. రవి బిష్ణోయ్, కుల్‌దీప్ యాదవ్ చెరో వికెట్ తీశారు. ఓపెనర్లు జెన్నెమన్ మలన్ (22), క్వింటన్ డికాక్ (48) తొలి వికెట్‌కు 49 పరుగులను జోడించారు. అయితే మలన్‌తోపాటు టెంబా బవుమా (8), ఐదెన్ మార్‌క్రమ్‌ (0) స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరడంతో దక్షిణాఫ్రికా కష్టాల్లో పడినట్లు అనిపించింది. ప్రారంభంలో తడబడిన సఫారీలను డేవిడ్ మిల్లర్ ఆదుకున్నాడు. డికాక్‌ పెవిలియన్‌ చేరిన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన డేవిడ్‌ మిల్లర్‌, హెన్రిచ్ క్లాసెన్‌తో కలిసి జట్టు స్కోరును పెంచుతూ వచ్చాడు.

Exit mobile version