NTV Telugu Site icon

Chennai Super Kings: చెన్నైకి మరో ఎదురుదెబ్బ.. ఆ స్టార్ ప్లేయర్ ఔట్

Big Blow To Csk

Big Blow To Csk

CSK Pacer Sisanda Magala Ruled Out For At Least Two Weeks: రాజస్థాన్ రాయల్స్ చేతిలో చావుదెబ్బ తిన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి.. ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభం అయినప్పటి నుంచే వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. గాయాల కారణంగా ఇప్పటికే దీపక్‌ చాహర్‌, సిమ్రన్‌జీత్‌ సింగ్‌, బెన్‌ స్టోక్స్‌, ముకేశ్‌ చౌదరీ సేవలను ఈ జట్టు కోల్పోయింది. ఇప్పుడు లేటెస్ట్‌గా మరో స్టార్ ప్లేయర్ కూడా గాయాల కారణంగా ఈ జట్టుకు దూరమయ్యాడు. అతడు మరెవ్వరో కాదు.. స్టార్ పేసర్, సఫారీ భారీకాయుడు సిసండ మగాలా!

Ajinkya Rahane: సూర్య ఢమాల్.. రహానే కమాల్.. బంపరాఫర్ పట్టేశాడుగా!

ఏప్రిల్‌ 12వ తేదీన రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా.. సిసండ మగాలా ఫీల్డింగ్‌ చేస్తూ, కుడి చేతి వేలికి దెబ్బ తగిలించుకున్నాడు. గాయం తీవ్రత​ ఎక్కువగా ఉండటంతో, అతడు రెండు వారాల పాటు లీగ్‌కు దూరంగా ఉంటాడని జట్టు కోచ్ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ స్పష్టం చేశాడు. ఇది సీఎస్కే జట్టుకి పెద్ద ఝలకేనని చెప్పుకోవాలి. ఎందుకంటే.. సీఎస్కే పేస్ విభాగం అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పుడు మగాలా సేవలు కూడా కోల్పోవడంతో.. దిక్కుతోచని స్థితి​కి చేరింది. ఆ జట్టుకు పేస్‌ విభాగంలో మరో ఆప్షన్‌ కూడా లేదు. హంగార్గేకర్‌, తుషార్‌ దేశ్‌ పాండే, ఆకాశ్‌సింగ్‌ వంటి అనుభవం లేని పేసర్లతోనే నెట్టుకురావాల్సి ఉంటుంది.

OYO Rooms: సింగిల్ రూమ్‌తో మొదలుపెట్టి.. గ్లోబల్ రేంజ్‌కి..

డ్వేన్‌ ప్రిటోరియస్‌, మతీష పతిరణ లాంటి విదేశీ పేస్‌ బౌలర్లు ఉన్నారు కానీ.. జట్టు సమీకరణల దృష్ట్యా ఆ ఇద్దరికి తుది జట్టులో అవకాశం లభించడం దాదాపు కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో, కేవలం బ్యాటర్ల సహాయంతో చెన్నై నెగ్గుకురావడమన్నది దాదాపు అసాధ్యమేనని చెప్పుకోవాలి. ఒకవేళ గాయాల బారిన పడిన పేసర్లు మరో రెండు వారాల్లో అందుబాటులోకి వచ్చినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతే, చేసేదేమీ ఉండదు. పేస్‌ బౌలింగ్‌ విభాగం విషయంలో సీఎస్‌కే ప్రత్యామ్నాయాలు చూసుకోకపోతే మాత్రం.. కష్టమేనని విశ్లేషకులు చెప్తున్నారు. అటు.. ధోని మోకాలికి గాయం కావడం కూడా మరింత కలవరపెడుతోంది.