CSK Opening Pair 2026: సీఎస్‌కే ఓపెనింగ్ కాంబో ఫిక్స్.. ఆయుష్‌ మాత్రే అవుట్!

  • సీఎస్‌కే 2026 సీజన్‌కు సీఎస్‌కేలో కీలక మార్పు
  • ఓపెనర్‌గా బరిలోకి సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్
  • నెంబర్ 3లో బ్యాటింగ్ చేయనున్న ఆయుష్‌ మాత్రే
CSK Opening Pair 2026

CSK Opening Pair 2026

Ruturaj Gaikwad and Sanju Samson to Open for CSK: ఐపీఎల్ 2025లో నిరాశాజనక ప్రదర్శన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) 2026 సీజన్‌కు కీలక మార్పులతో సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఓపెనింగ్ కాంబినేషన్‌లో మార్పు చోటుచేసుకోనుంది. ఈ విషయాన్ని ఐపీఎల్‌ 2026 కెప్టెన్స్‌ డే ఈవెంట్‌ సందర్భంగా సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్వయంగా ప్రకటించాడు. ఈ సీజన్‌లో తానే ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నట్లు స్పష్టం చేశాడు. రుతురాజ్‌తో పాటు కొత్తగా జట్టులో చేరిన స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ ఓపెనింగ్ బాధ్యతలు తీసుకోనున్నాడు. దీంతో గత సీజన్‌లో ఓపెనర్‌గా ఆడిన యువ ఆటగాడు ఆయుష్‌ మాత్రే దిగువన (నెంబర్ 3) బ్యాటింగ్ చేయనున్నాడు.

ఐపీఎల్ 2025లో రుతురాజ్ గైక్వాడ్ ఎక్కువగా నెంబర్ 3లో బ్యాటింగ్ చేశాడు. అయితే ఈసారి టీమ్ కాంబినేషన్ దృష్ట్యా అతడిని మళ్లీ ఓపెనర్‌గా పంపాలని సీఎస్‌కే మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. మరోవైపు సంజు శాంసన్ ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉండటం సీఎస్‌కేకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. ఈ ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్ ప్రారంభిస్తే జట్టుకు బలమైన ఆరంభం లభించే అవకాశం ఉందని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. రుతురాజ్ నిలకడ, సంజు దూకుడు ఈసారి సీఎస్‌కేకు కలిసొచ్చేలా ఉంది. ముఖ్యంగా సంజు పవర్ ప్లేలో భారీగా రన్స్ రాబడితే.. చెన్నై భారీ స్కోర్ చేయడం లేదా సునాయాస విజయం సాధించడం ఖాయం. టీ20 ప్రపంచ కప్ 2026లో సంజు దంచి కొట్టిన విషయం తెలిసిందే.

అయుష్ మ్హాత్రే గత సీజన్‌లో రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా వచ్చి మంచి ఇంపాక్ట్ చూపించాడు. కేవలం 7 ఇన్నింగ్స్‌లలో 240 పరుగులు చేసి 34.28 సగటు, 188.97 స్ట్రైక్ రేట్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఆర్సీబీపై చేసిన 94 పరుగుల ఇన్నింగ్స్ అతడి టాలెంట్‌ను ప్రపంచానికి చూపింది. ఈ నేపథ్యంలో అతడిని నెంబర్ 3లో ఆడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మ్హాత్రేకు పోటీగా మరికొందరు ఆటగాళ్లు ఉన్నారు. ఉర్విల్ పటేల్ టాప్ ఆర్డర్‌లో దూకుడుగా ఆడగలడు. సర్ఫరాజ్ ఖాన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో అద్భుతంగా రాణించాడు. అలాగే డేవాల్డ్ బ్రెవిస్ కూడా టీమ్‌లో ఉండటం వల్ల బ్యాటింగ్ ఆర్డర్‌లో పోటీ మరింత పెరిగింది. మరి ఏ ప్లేయర్ ఏ స్థానంలో ఆడుతాడో చూడాలి.

Also Read: Priyanka Chopra: నిక్‌లో నిజాయతీ ఉంది.. ఆరు నెలల్లోనే పెళ్లి.. రూమర్లు ఎందుకు వస్తున్నాయో!

ఐపీఎల్ 2026 మార్చి 28ఆ ఆరంభం కానుంది. మొదటి మ్యాచ్‌లో బెంగళూరు, హైదరాబాద్ తలపడనున్నాయి. సీఎస్‌కే తమ తొలి మ్యాచ్‌ను మార్చి 30న గువాహటిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో సంజు సాంసన్ తన మాజీ జట్టుపై తొలిసారి బరిలోకి దిగనున్నాడు. కొత్త ఓపెనింగ్ కాంబినేషన్‌తో సీఎస్‌కే ఎలా ఆడుతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆరో టైటిల్ సాధించాలని చెన్నై ఫాన్స్ కోరుకుంటున్నారు.