CSK New Coach: సీఎస్కే కొత్త కోచ్.. ఎంఎస్ ధోనీ రెండు కీలక షరతులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కొత్త హెడ్ కోచ్ కోసం అన్వేషణ కొనసాగుతోంది. దీర్ఘకాలంగా సీఎస్కేకు కోచ్‌గా వ్యవహరించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇటీవల బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో తదుపరి కోచ్ ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో పలువురి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వచ్చే వారంలో కొత్త కోచ్‌పై సీఎస్కే యాజమాన్యం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఓ జాతీయ మీడియా నివేదిక ప్రకారం.. టీమిండియా మాజీ బ్యాటర్ హేమంగ్ బదానీ సీఎస్కే తదుపరి హెడ్ కోచ్‌గా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు సీఎస్కే మేనేజ్మెంట్ కొత్త కోచ్ ఎంపికపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కొత్త కోచ్ విషయంలో ధోనీ రెండు కీలక ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా సీఎస్కే సపోర్ట్ స్టాఫ్‌ను భారతీయుల నేతృత్వంలో నడిపించాలని మహీ సూచించినట్లు తెలుస్తోంది. అదే జరిగితే హేమంగ్ బదానీకి అవకాశాలు మరింత మెరుగవుతాయని సదరు నివేదిక పేర్కొంది.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
- Harmanpreet Kaur: ప్రతిసారి నేనున్నానని ముందుకొస్తుంది.. వికెట్స్ తీస్తుంది.. హర్మన్‌ప్రీత్ సంతోషం!
- Sanju Samson: సంజు శామ్సన్ ఉదారత.. 1,000 మంది యూపీఎస్సీ అభ్యర్థులకు స్కాలర్షిప్లు..
- Lala Amarnath: భారత్‌కు తొలి సెంచరీ అందించిన వీరుడు.. పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఈ హీరో గురించి మీకు తెలుసా?
ఐపీఎల్లో కోచింగ్ అనుభవంతో పాటు విదేశీ టీ20 లీగ్‌లలోనూ హేమంగ్ బదానీకి మంచి అనుభవం ఉంది. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో అనుబంధం కలిగి ఉన్న బదానీ.. ది హండ్రెడ్‌లో సదర్న్ బ్రేవ్, ILT20లో దుబాయ్ క్యాపిటల్స్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. అలాగే సియాటిల్ ఆర్కాస్‌కు కన్సల్టెంట్‌గా కూడా పనిచేస్తున్నాడు. విదేశీ లీగ్‌లలో అతడి అనుభవం సీఎస్కేకు కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు.
ఎంఎస్ ధోనీ చేసిన మరో కీలక ప్రతిపాదన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సీఎస్కే కొత్త హెడ్ కోచ్ కేవలం చెన్నై సూపర్ కింగ్స్ పైనే పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని సూచించినట్లు సమాచారం. ఇతర టీ20 ఫ్రాంచైజీలతో ఏకకాలంలో కోచింగ్ బాధ్యతలు నిర్వహించే విధానానికి ముగింపు పలకాలని ధోనీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. స్టీఫెన్ ఫ్లెమింగ్ గతంలో సీఎస్కేతో పాటు SA20లో జొహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్, మేజర్ లీగ్ క్రికెట్లో టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్లకు కూడా కోచ్‌గా వ్యవహరించాడు. అయితే ఇకపై సీఎస్కే కోచ్‌కు ఇతర ఫ్రాంచైజీల బాధ్యతలు ఉండకూడదన్నది ధోనీ ప్రతిపాదనగా ఆ నివేదిక పేర్కొంది.
2023లో చివరిసారిగా ఐపీఎల్ టైటిల్ గెలిచిన సీఎస్కే.. ఆ తర్వాత వరుసగా నిరాశపరుస్తోంది. 2026 సీజన్లో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నచెన్నై.. గత మూడు సీజన్లలోనూ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో కొత్త కోచ్ ఎంపికపై సీఎస్కే తీసుకునే నిర్ణయం జట్టు భవిష్యత్తుకు కీలకంగా మారనుంది. ప్రస్తుతం హేమంగ్ బదానీ ఈ రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి సీఎస్కే హెడ్ కోచ్‌గా ఎవరు వస్తారో.
తాజావార్తలు
-
CSK New Coach: సీఎస్కే కొత్త కోచ్.. ఎంఎస్ ధోనీ రెండు కీలక షరతులు!
-
DILRMP 3.0: ఇకపై మీ భూమికి కూడా ‘ఆధార్’ లాంటి నెంబర్.. కేంద్రం సరికొత్త పథకం ప్రారంభం.!
-
H-1B Visa: ఉద్యోగం పోతే అమెరికాలో ఉండటం కష్టమేనా? 60 రోజుల గడువు తొలగించే దిశగా ట్రంప్ ప్రభుత్వం
-
Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
-
AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!