CSK-IPL 2027: సీఎస్కే కీలక నిర్ణయం.. ఆ ఊహాగానాలకు చెక్!
- ఐపీఎల్ 2026 సీజన్లో సీఎస్కే నిరాశాజనక
- పాయింట్లతో 8వ స్థానంలో సీఎస్కే
- సీఎస్కే కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CSK Take Big Call on Stephen Fleming: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) నిరాశాజనక ప్రదర్శన చేసింది. 14 మ్యాచ్‌లలో 8 ఓటములు, 6 విజయాలతో 12 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచింది. అయినా సీఎస్కే తమ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్పై పూర్తి నమ్మకం ఉంచినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఫ్లెమింగ్ భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వినిపించినా.. ఆయనను పదవి నుంచి తొలగించే ఆలోచనలో సీఎస్కే యాజమాన్యం లేదని తాజా నివేదికలు వెల్లడించాయి. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి సీఎస్కేతో అనుబంధం కొనసాగిస్తున్న ఫ్లెమింగ్.. 2009 నుంచి హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుతం అతడి కాంట్రాక్టును మరో సీజన్‌కు పొడిగించే దిశగా ఫ్రాంచైజీ ఆలోచనలు వేస్తున్నట్లు సమాచారం.
గత రెండు సీజన్లుగా సీఎస్కేకు తీవ్రంగా నిరాశపరుస్తోంది. 2025 సీజన్లో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన చెన్నై.. 2026లో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. అయినప్పటికీ స్టీఫెన్ ఫ్లెమింగ్ అనుభవం, జట్టుపై అతడి ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని యాజమాన్యం అతడిని కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్‌పై సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం ఫ్లెమింగ్ కాంట్రాక్ట్ పొడిగింపును అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ప్రస్తుతం ఫ్లెమింగ్ అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ)లో టెక్సాస్ సూపర్ కింగ్స్ హెడ్ కోచ్‌గా పనిచేస్తున్నాడు.
Also Read
- Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
మరోవైపు సీఎస్కేకు సంబంధించి ట్రేడ్ డీల్‌పై కూడా ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఖలీల్ అహ్మద్, డేవిడ్ మిల్లర్లకు సంబంధించి ఢిల్లీ క్యాపిటల్స్‌తో ట్రేడ్ చర్చలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే హార్దిక్ పాండ్య విషయంలో సీఎస్కే ఎలాంటి అధికారిక సంప్రదింపులు జరపలేదని సమాచారం. ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు భారీ ట్రేడ్ డీల్‌గా నిలిచే అవకాశం ఉన్న రిషభ్ పంత్-కుల్దీప్ యాదవ్ మార్పిడి చర్చలు కూడా జోరుగా సాగుతున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ నుంచి పంత్ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లే అవకాశం ఉందని, బదులుగా కుల్దీప్ లక్నో జట్టులో చేరే అవకాశాలు ఉన్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి.
2025 మెగా వేలంలో రూ.27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకున్న రిషభ్ పంత్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో నాయకత్వ బాధ్యతలపై విభేదాల నేపథ్యంలో అతడు జట్టును వీడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ పాత జట్టుకు చేరే దిశగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ ట్రేడ్‌కు సంబంధించిన ఆర్థిక అంశాలు, ఇతర నిబంధనలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదం లభించిన తర్వాతే ఈ భారీ ట్రేడ్ అధికారికంగా ఖరారయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!