NTV Telugu Site icon

MS Dhoni: ధోనీకి ఇదే చివరి సీజనా.. క్లారిటీ ఇచ్చిన సీఎస్కే కోచ్

Fleming On Dhoni

Fleming On Dhoni

CSK Coach Stephen Fleming Gives Clarity On MS Dhoni Retirement: మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అంటూ కొన్ని రోజుల నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే! ధోనీ సైతం.. వివిధ సందర్భాల్లో తన వీడ్కోలుపై పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. కోల్‌కతాలో పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో ధోనీ మాట్లాడుతూ.. తాము ఆడుతున్న ప్రతీ గ్రౌండ్‌లోనూ అభిమానులు ఆదరిస్తున్న విధానం చూస్తుంటే, తనకు ఫేర్‌వేల్ ఇస్తున్నట్టు అనిపిస్తోందంటూ కుండబద్దలు కొట్టాడు. అంతేకాదు.. తన ఐపీఎల్ కెరీర్ చివరి దశలోనూ ఉందంటూ షాకిచ్చాడు. ఇక అప్పటినుంచి అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఈ సీజన్ తర్వాత ధోనీని చూడలేమేమోనంటూ.. కాస్త నిరాశలో ఉన్నారు. ఇప్పుడు వారిలో జోష్ నింపుతూ.. సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఒక శుభవార్త చెప్పాడు. తన రిటైర్‌మెంట్‌పై ధోనీ ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదని స్పష్టం చేశాడు.

Nora Fatehi: ఏవమ్మా .. మనోహరీ.. అసలే ఎండాకాలం.. నువ్వింకా హీట్ పెంచాలా

స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. ‘‘తన చివరి ఐపీఎల్ సీజన్ ఇదేనంటూ ధోనీ ఎప్పుడూ చెప్పలేదు. ప్రస్తుతానికి అతనికి ఆ ఆలోచన కూడా లేదు. ఈ సీజన్‌లో సీఎస్కేను ఛాంపియన్‌గా నిలవడంపైనే ధోనీ, మేము దృష్టి సారించాం’’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సీజన్ తర్వాత తాను రిటైర్ అవుతానని ధోనీ ఎప్పుడూ చెప్పలేదని, అసలు అలాంటి సంకేతాలే ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చాడు. ఈ లెక్కన.. ధోనీకి ఇదే లాస్ట్ సీజన్ కాకపోవచ్చు. వచ్చే ఏడాది కూడా అతడు ఆడుతాడని ఆశించొచ్చు. ఏదేమైనా.. ఈ మిస్టరీకి తెరపడాలంటే, ధోనీ కన్ఫర్మేషన్ వరకూ వేచి చూడాల్సిందే. కాగా.. గత సీజన్‌లో కూడా ధోనీపై ఇలాంటి వార్తలే వచ్చాయి. 2023 సీజన్‌లో ధోనీ ఆడకపోవచ్చంటూ పుకార్లు షికారు చేశాయి. అయితే.. వాటన్నింటికీ చెక్ పెడుతూ, ధోనీ ఈ సీజన్‌లో కూడా సీఎస్కేని విజయవంతంగా నడిపిస్తున్నాడు. సో.. వచ్చే ఏడాది ఇదే రిపీట్ అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని క్రికెట్ నిపుణులు చెప్తున్నారు.

RCB vs LSG: ముగిసిన ఆర్సీబీ బ్యాటింగ్.. లక్నో ముందు స్వల్ప లక్ష్యం

ఇదిలావుండగా.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ధోనీ ఒకడు. ధోనీ నాయకత్వం వల్లే, ఐపీఎల్‌లో సీఎస్కే అత్యంత బలమైన జట్టుగా కొనసాగుతోందని చెప్పుకోవడంలో సందేహం లేదు. తన నాయకత్వం, బ్యాటింగ్ నైపుణ్యాలతో జట్టుని పటిష్టం చేస్తూ వచ్చాడు. కేవలం ఆరు సంవత్సరాల వ్యవధిలోనే ధోనీ సీఎస్కేకి మూడు టైటిళ్లు సాధించి పెట్టాడు. అలాంటి ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తే మాత్రం.. సీఎస్కేకి పెద్ద నష్టం కలుగుతుందని చెప్పుకోవచ్చు.