NTV Telugu Site icon

Cristiano Ronaldo: రొనాల్డోకు బంపరాఫర్.. చరిత్రలో ఎన్నడూ లేని భారీ డీల్

Ronaldo Bumper Offer

Ronaldo Bumper Offer

Cristiano Ronaldo Huge Deal With Al Nazar Club: ఈ ఏడాది ఫిపా వరల్డ్‌కప్‌ను క్రిస్టియానో రొనాల్డో సొంతం చేసుకోలేకపోయినా.. అంతకుమించిన అదృష్టం అతడ్ని వరించింది. ఫుట్‌బాల్ చరిత్రలో కనీవినీ ఎరుగని భారీ ఆఫర్‌ని అతడు పట్టేశాడు. ఫిఫా వరల్డ్‌కప్‌కు ముందే మాంచెస్టర్‌ యునైటెడ్‌తో తెగదెంపులు చేసుకున్న రొనాల్డో.. ఇప్పుడు సౌదీ అరేబియాకు చెందిన ‘అల్ నజర్’ క్లబ్‌తో చేరాడు. ఈ క్లబ్ రొనాల్డోతో ఏడాదికి 200 మిలియన్ యూరోలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. సౌదీ క్లబ్‌తో 2025 జూన్ వరకు, అంటే రెండున్నరేళ్ల వరకు ఆ క్లబ్ తరఫున ఆడేందుకు రొనాల్డో డీల్ ఫిక్స్ చేసుకున్నాడు. కాబట్టి, అతడు ఓవరాల్‌గా 500 మిలియన్ యూరోస్ (మన భారత కరెన్సీలో దాదాపు రూ.4400 కోట్లు) అందుకోనున్నాడు. దీంతో ఫుట్‌బాల్‌ చరిత్రలోనే అత్యధిక ధర కలిగిన ఆటగాడిగా రొనాల్డో హిస్టరీ క్రియేట్ చేశాడు.

Rishabh Pant: అవన్నీ తప్పుడు వార్తలు.. అదే నిజమైతే పంత్ బతికేవాడు కాదు

తమ జెర్సీని రొనాల్డో చేత పట్టుకున్న ఫోటోలను అల్ నజర్ క్లబ్ ట్విటర్ షేర్‌లో చేస్తూ.. తమ క్లబ్‌కి వెల్కమ్ చెప్పింది. ఇది సరికొత్త చరిత్ర అని పేర్కొంది. ఈ డీల్‌తో తమ క్లబ్‌ అద్భుత విజయాలను సాధించేలా ప్రేరణ పొందడమే గాక.. తమ దేశం, తమ భవిష్యత్తు తరాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు స్పూర్తినిస్తుందని రాసుకొచ్చింది. అటు రొనాల్డో కూడా ఈ డీల్‌పై ఒక ప్రకటన విడుదల చేశాడు. మరో దేశంలో కొత్త ఫుట్‌బాల్‌ లీగ్‌లో ఆడేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానన్నాడు. ఇప్పటికే అనేక లీగ్‌లు, టోర్నీలను గెలిచానని.. ఆసియా ఆటగాళ్లతోనూ తన అనుభవాన్ని పంచుకునేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నానని తెలిపాడు.

Ukraine War: విజయం సాధించే వరకు పోరాడుతూనే ఉంటాం.. జెలన్ స్కీ న్యూఇయర్ సందేశం

కాగా.. ఫిఫా ప్రారంభానికి ముందు మాంచెస్టర్‌ యునైటెడ్‌ క్లబ్‌తో రొనాల్డో తెగదెంపులు చేసుకున్నాడు. పోర్చుగల్‌ సీనియర్‌ జాతీయ జట్టుకు 2003లో ఎంపికైన రొనాల్డో.. అదే ఏడాది క్లబ్‌ కెరీర్‌ను ప్రారంభించాడు. నాలుగేళ్లపాటు మాంచెస్టర్‌ యునైటెడ్‌ క్లబ్‌కు ఆడిన రొనాల్డో.. ఆ తర్వాత రియల్‌ మాడ్రిడ్‌, జువెంటస్ క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. 14 ఏళ్ల తర్వాత 2021లో తిరిగి మాంచెస్టర్‌ క్లబ్‌కు వచ్చినప్పటికీ.. ఏడాదికే ఆ బంధం తెగింది.

Show comments