టీమిండియా వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ తన అభిమానులకు గుడ్‌న్యూస్ అందించాడు. దినేష్ కార్తీక్, దీపిక పల్లికల్ జంటకు గురువారం నాడు కవల పిల్లలు జన్మించారు. దీంతో ఈ శుభవార్తను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘ముగ్గురం కాస్తా.. ఐదుగురం అయ్యాం. దీపిక, నేను ఇద్దరు అందమైన మగ పిల్లలతో ఆశీర్వాదం పొందాం. ఇంతకన్నా సంతోషంగా ఉండలేము’ అంటూ డీకే రాసుకొచ్చాడు. అంతేకాకుండా తన కవల పిల్లలకు కబీర్ పల్లికల్ కార్తీక్, జియాన్ పల్లికల్ కార్తీక్ అని పేర్లు పెడుతున్నట్లు కూడా దినేష్ కార్తీక్ ప్రకటించాడు.
Read Also: కోహ్లీ నిరాశపరిచాడు అంటున్న జడేజా
కాగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన దినేష్ కార్తీక్ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటే 2004లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో 26 టెస్టులు, 94 వన్డేలు, 32 టీ20 మ్యాచులు ఆడాడు. ఓవరాల్‌గా దాదాపు 2200 పరుగులు చేసిన దినేష్ కార్తీక్.. ఐపీఎల్‌లో ఏడు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. గత ఏడాది కెప్టెన్‌గా తమిళనాడు జట్టుకు సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీని అందించాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫైనల్‌కు చేరడంలోనూ దినేష్ కార్తీక్ తన వంతు పాత్ర పోషించాడు.
