Spyder Camera: ‘స్పైడర్’ను బ్యాన్ చేయండి.. ఇది ఫీల్డర్లకు శాపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cricket Fans Demanding To Ban Spyder Camera: స్పైడర్ కెమెరా.. ఇది మైదానంలో అటూ ఇటూ తిరుగుతూ ఆటగాళ్ల కదలికల్ని, మ్యాచ్‌ని కవర్ చేస్తుంది. ఇతర కెమెరామెన్లు చేయలేని పనిని, ఇది చేసి చూపిస్తుంది. అయితే.. ఈ కెమెరా వల్ల ఒక పెద్ద చిక్కు కూడా ఉంది. బ్యాటర్లు భారీ షాట్లు కొట్టి, బంతిని గాల్లో లేపినప్పుడు.. ఈ కెమెరా కదలికలు ఫీల్డర్లను కాస్త అయోమయానికి గురి చేస్తుంటాయి. దాని వల్ల క్యాచ్‌లు మిస్ అవుతుంటాయి. అంతేకాదు.. ఈ కెమెరా కేబుల్‌కి బంతి తగిలినప్పుడు, దాని గమ్యం కూడా మారిపోతుంటుంది. అంటే.. ఒకచోట పడాల్సిన బంతి, మరొక చోట పడుతుంది. సరిగ్గా ఇలాంటి పరిణామమే మొన్న భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది. దాంతో.. షాన్ మసూద్‌కి ఒక లైఫ్ వచ్చింది. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం.
షాన్ మసూద్ 31 పరుగుల వద్ద ఉన్నప్పుడు.. ఒక భారీ షాట్ కొట్టాడు. దాంతో బంతి గాల్లోకి ఎగిరింది. తనవైపుకి బంతి దూసుకువస్తుండటంతో.. క్యాచ్ పట్టేందుకు డీప్‌లో ఉన్న విరాట్ కోహ్లీ సిద్ధంగా ఉన్నాడు. కానీ.. ఇంతలోనే ఆ బంతి నేరుగా స్పైడర్ కెమెరా కేబుల్‌కి తగలడంతో, దాని దిశ మారిపోయింది. కోహ్లీ చేతికి చిక్కాల్సిన ఆ బంతి.. వేరే చోట పడింది. అలా షాన్ మసూద్ సేవ్ అయ్యాడు. ఒకవేళస్పైడర్ కెమెరా లేకపోయుంటే.. ఆ బంతి నేరుగా కోహ్లీ చేతిలో పడి, షాన్ మసూద్ ఔటయ్యేవాడు. కానీ.. అలా జరగలేదు. అది చూసిన హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మలు.. స్పైడర్ కెమెరాపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పాండ్యా అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బూతులు తిట్టడాన్ని మనం గమనించవచ్చు. ఇలా మసూద్‌కి లైఫ్ రావడం వల్లే.. అతడు ఆర్థశతకం చేసి, తన పాక్ జట్టుకి గౌరవప్రదమైన స్కోరుని తెచ్చిపెట్టాడు.
Also Read
- Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
- Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్‌లో రెండో సెంచరీ నమోదు..
- Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ 'వాటర్ బాయ్'గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ ఒకసారి జరిగింది. 2014-15లో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ఒక మ్యాచ్ సందర్భంగా బంతికి గాల్లోకి లేపగా.. ఈ స్పైడర్ కెమెరా అడ్డు రావడం వల్లే బతికిపోయాడు. ఇంకా చాలా సందర్భంగాల్లో పీల్డర్లు ఈ కెమెరా వల్ల ఇబ్బందిపడ్డారు. దీంతో.. ‘‘స్పైడర్ కెమెరా అవసరమా? ఇది పరోక్షంగా బ్యాటర్లకు అదృష్టం కలిగిస్తోంది, ఫీల్డర్లకు శాపంగా మారుతోంది. దీన్ని బ్యాన్ చేయండి’’ అంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా.. 2007లో ఐపీఎల్ తొలి సీజన్లో ఈ స్పైడర్ కమెరాల్ని తొలిసారి ఉపయోగించారు. అప్పట్నుంచి క్రమంగా ఇది అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టింది.
https://twitter.com/Vaishnaviiyer14/status/1584114247054655489?s=20&t=hBrjn8Xi5vecdLjOfIVlYA
తాజావార్తలు
-
Ather Konark: ఏథర్ నుంచి చౌక స్కూటర్ ‘‘కోనార్క్’’.. ఆగస్టు 29న గ్రాండ్ లాంచ్..
-
Fauzi Shooting Update: ‘ఫౌజీ’ కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
-
iTel Ace 3 Heera: రూ.949కే బెస్ట్ ఫీచర్ ఫోన్.. వాయిస్ అసిస్టెంట్, 13 రోజుల బ్యాటరీ.. ఇంకా..
-
US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
-
Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!