Site icon NTV Telugu

T20 World Cup: టీమిండియా పట్ల వివక్ష.. క్రికెట్ ఆస్ట్రేలియాపై విమర్శల వర్షం

Team India

Team India

T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. మన జట్టుతో పాటు ప్రపంచ జట్లన్నీ ఆస్ట్రేలియాలోనే మకాం వేశాయి. ఈ మేరకు అన్ని జట్లకు సమానంగా క్రికెట్ ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే టీమిండియా పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా వివక్ష చూపుతుందనే అనుమానాలు వస్తున్నాయి. రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడేందుకు భారత జట్టు బ్రిస్బేన్ చేరుకోగా.. అక్కడ మన ఆటగాళ్లకు ఫోర్ స్టార్ హోటల్‌లో వసతి కల్పించడం విమర్శలకు దారి తీసింది. ఎందుకంటే పాకిస్థాన్ టీమ్ కూడా వార్మప్ మ్యాచ్‌ల కోసం బ్రిస్బేన్‌లో ఉంది. ఆ జట్టుకు మాత్రం క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు ఫైర్ స్టార్ హోటల్‌లో వసతి కల్పించారు.

Read Also: Corona Virus: బీ అలర్ట్.. బీఎఫ్-7 వేరియంట్ రూపంలో మళ్లీ కోరలు చాస్తున్న కరోనా

చివరకు ఆస్ట్రేలియా టీమ్ ఆటగాళ్లకు కూడా ఫైవ్ స్టార్ హోటల్లోనే వసతి బుక్ చేశారు. మరి అలాంటిది టీమిండియాకు మాత్రమే ఫోర్ స్టార్ హోటల్‌లో వసతి ఇవ్వడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా కావాలనే వివక్ష చూపుతోందని భారత అభిమానులు మండిపడుతున్నారు. నిన్నటికి నిన్న వార్మప్ మ్యాచ్‌లో గెలిచిన టీమిండియాను ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ అరోన్ ఫించ్ చిన్నచూపు చూశాడు. వార్మప్ మ్యాచ్‌లో గెలిస్తే ప్రపంచకప్ గెలిచినట్లేనా అంటూ ఎద్దేవా చేశాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు, ఆ టీమ్ మేనేజ్‌మెంట్‌పై టీమిండియా అభిమానులు ఫైర్ అవుతున్నారు. పొగరుతో ఇలాగే వ్యవహరిస్తే ఆస్ట్రేలియా జట్టుకు దేవుడే బుద్ధి చెప్తాడని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version