Commonwealth games meera bai chanu won the gold medal: కామన్వెల్త్ గేమ్స్ లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే రెండు పతకాలను గెలుచుకోగా.. తాజాగా మరో పతకాన్ని ఇండియా కైవసం చేసుకుంది. భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను ఏకంగా స్వర్ణాన్ని గెలుచుకుంది. దీంతో భారత్ ఇప్పటి వరకు మూడు పతకాలను కైవసం చేసుకుంది. ఇప్పటికే రజతం, కాంస్య పతకాలు గెలుచుకోగా.. ఇప్పుడు స్వర్ణాన్ని గెలుచుకున్నారు మీరాబాయి చాను. 49 కేజీల విభాగంలో స్నాచ్ లో 88 ఎత్తిన చాను, క్లీన్ అండ్ జర్క్ లో 113 కేజీల బరువును ఎత్తి రికార్డు క్రియేట్ చేసింది. మొత్తంగా 201 కిలోల బరువును ఎత్తి ఈ ఘనత సాధించింది.
Read Also: Team India: జింబాబ్వే పర్యటనకు భారత జట్టు ప్రకటన.. కోహ్లీకి అవకాశం ఇవ్వని సెలక్టర్లు
మొత్తంగా ఇప్పటి వరకు భారత్ మూడు పతకాలను సాధించింది. అంతకుముందు 55 కేజీల విభాగంలో సంకేత్ మహదేవ్ సార్గర్ రజత పతకాన్ని సాధించారు. 61 కేజీల విభాగంలో గురురాజ్ పూజరి కాంస్య పతకాన్ని సాధించారు. కాగా.. సంకేత్ తృటిలో స్వర్ణాన్ని కోల్పోయారు. మొత్తంగా 248 కేజీ బరువును ఎత్తి స్వర్ణానికి దగ్గర్లో ఆగిపోారు. స్నాచ్ లో 113 కేజీలు ఎత్తిన సర్గర్ క్లీన్ అండ్ జర్క్ లో మొదటగా 135 కేజీలు ఎత్తిన మహాదేవ్.. మిగిలిన రెండు ప్రయత్నాల్లో 139 కేజీలను ఎత్తలేకపోయాడు. దీంతో స్వర్ణం ఆశలు చేజారాయి. 61 కేజీల విభాగంలో బ్రాంజ్ మెడల్ అందుకున్న గురురాజ్ స్నాచ్ లో 118 కేజీలు, క్లీన్ అండ్ జర్క్ లో 151 కిలోలను ఎత్తి మొత్తంగా 269 కిలోలు ఎత్తి మూడోస్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.