శ్రీలంకలో భారత, లంక జట్ల మధ్య టీ20 మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇప్పటికే తొలి టీ20లో ఇండియా జట్టు విజయం సాధించింది. ఎలాగైనా రెండో మ్యాచ్‌లో విజయం సాధించి సమం చేయాలని లంక జట్టు చూస్తున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా జట్టును కట్టడి చేయడంలో లంక బౌలర్లు సఫలం అయ్యారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రాబట్టేందుకు భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందులు పడ్డారు. ఇండియా టీమ్‌లో కెప్టెన్ శిఖర్ ధావన్ 40 పరుగులు చేయగా, రుతురాజ్ 21, పడిక్కల్ 29 చేశారు. దీంతో లంక ముందు 133 పరుగుల లక్ష్యం ఉన్నది. లంక బౌలర్లలో అఖిల ధనుంజయ 2, హసరంగ, శనక, చమీరా తలో ఒక వికెట్ తీసుకున్నారు.
Read: సల్మాన్ ‘అలాంటి వాడు’ అంటోన్న ‘సామజవరగమన’!