Clicky Ponting: ‘ఫేక్ ఎడ్జ్’ చీటింగ్ చేసింది ఇతగాడే.. వివాదంలో కొత్త ట్విస్ట్.. భారతీయ స్పాన్సర్షిప్ గుడ్‌బై!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లండ్ క్లబ్ క్రికెట్లో వెలుగుచూసిన ‘ఫేక్ ఎడ్జ్’ చీటింగ్ వివాదం రోజురోజుకూ మరింతగా ముదురుతోంది. బ్యాట్‌కు బంతి తగలకపోయినా.. స్లిప్ ఫీల్డర్ చేతి వేళ్లతో చిటికె వేసి ఎడ్జ్ అయినట్లు శబ్దం సృష్టించి పలువురు బ్యాటర్లను అవుట్ చేయించారనే ఆరోపణలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి. తాజాగా ఇలానే ఓ బ్యాటర్ ఔట్ అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. నార్త్ యార్క్‌షైర్ అండ్ సౌత్ డర్హామ్ క్రికెట్ లీగ్ ఇప్పటికే అధికారిక విచారణ ప్రారంభించింది.
వైరల్ అయిన వీడియోలో కనిపించింది సాల్ట్‌బర్న్ క్రికెట్ క్లబ్ సెకండ్ ఎలెవన్ ఆటగాడు బ్రియాన్ డివైన్. ఇప్పుడు అతడి పైనే ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. అభిమానులు అతడికి ‘క్లిక్కీ పాంటింగ్’ అనే పేరు పెట్టారు. ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ పేరును ఉద్దేశించి ఇలా వ్యంగంగా నామకరణం చేశారు. ఈ ఘటనపై మిడిల్స్‌బ్రో క్రికెట్ క్లబ్ సెకండ్ ఎలెవన్ కెప్టెన్ స్పందిస్తూ.. ఈ మ్యాచ్‌లో ఇలాంటి సంఘటనలు పలుమార్లు జరిగాయని ఆరోపించాడు. యువ బ్యాటర్ల ఆత్మవిశ్వాసంపై ఈ ఘటనలు ప్రభావం చూపాయని ఆవేదన వ్యక్తం చేశాడు.
Also Read
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- Kohli 55th Century: రికార్డులే దాసోహమైన వేళ.. విరాట్ కోహ్లీ వీరవిహారం.. పలు రికార్డులు బద్దలు..
- Rothit Sharma: రోహిత్ శర్మ కట్ అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాల్సిందే డూడ్..
ఈ వివాదం పెద్దది కావడంతో బ్రియాన్ డివైన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక భారతీయ రెస్టారెంట్ ‘స్పైసెస్’ అతనికి అందిస్తున్న స్పాన్సర్‌షిప్‌ను ఉపసంహరించుకున్నట్లు ఓ బ్రిటిష్ మీడియా పేర్కొంది. ఇదిలా ఉండగా ప్రముఖ బ్రిటిష్ టీవీ వ్యాఖ్యాత పియర్స్ మోర్గాన్ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ.. ‘క్లిక్కీ పాంటింగ్ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద మోసగాడు. ఇలాంటి పని అతను ఎంతకాలంగా చేస్తున్నాడు?, ఎంతమంది బ్యాటర్లను ఇలా అవుట్ చేశాడు’ అంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఈ ఘటనపై అధికారిక ఫిర్యాదు అందిందని, పూర్తి స్థాయి విచారణ ప్రారంభించినట్లు నార్త్ యార్క్‌షైర్ అండ్ సౌత్ డర్హామ్ క్రికెట్ లీగ్ ప్రకటించింది. విచారణ పూర్తయ్యే వరకు ఈ వ్యవహారంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?