Site icon NTV Telugu

Cheteshwar Pujara: టీ20 వరల్డ్‌కప్ తుది జట్టులో ఆ ఇద్దరూ ఉండాల్సిందే

Cheteshwar On Pant Vs Dk

Cheteshwar On Pant Vs Dk

Cheteshwar Pujaga Gives His Verdict On Rishabh Pant vs Dinesh Karthik: టీ20 వరల్డ్‌కప్ సమీపిస్తున్న తరుణంలో.. భారత జట్టులో ఎవరెవరికి చోటు దక్కితే బాగుంటుందన్న చర్చలు జోరుగా జరుగుతున్నాయి. ఇదే సమయంలో సీనియర్ ఆటగాళ్లు సైతం, ఎవరిని తుది జట్టుకి ఎంపిక చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాల్ని వెల్లడిస్తున్నారు. తాజాగా భారత వెటరన్ క్రికెటర్ చెతేశ్వర్ పుజారా కూడా తన అభిప్రాయాన్ని తెలిపాడు. వరల్డ్‌కప్ తుది జట్టులో పంత్, దినేశ్ కార్తిక్ ఇద్దరూ ఉండాలని అన్నాడు. 5, 6, 7వ స్థానాల్లో ఎవర్ని ఎంపిక చేయాలన్న ప్రస్తావన వస్తే.. తాను వరుసగా పంత్, హార్దిక్ పాండ్యా, కార్తీక్‌కు అవకాశం ఇస్తానన్నాడు. భారత బ్యాటింగ్ లైనప్ మరింత పటిష్టంగా మారాలన్నాడు. ఇక భారత్ అదనపు బౌలింగ్ ఎంపిక కావాలంటే.. పంత్ స్థానంలో దీపక్ హుడాను ప్లేయింగ్ ఎలెవెల్‌లోకి తీసుకుంటే బాగుంటుందన్నాడు. ఒకవేళ అతడ్ని తుది జట్టులో ఆడించినట్లైతే, ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి పంపితే బాగా ఆడుతాడని పుజారా చెప్పుకొచ్చాడు.

కాగా.. వరల్డ్‌కప్ తుది జట్టులో పంత్, దీపక్‌లలో ఎవరికి చోటిస్తే బాగుంటుందన్న విషయంపై చాలా రోజుల నుంచే చర్చలు జోరుగా సాగుతున్నాయి. వన్డే, టెస్టుల్లో పంత్ అదరగొడుతున్నాడు కానీ.. అదే జోరుని టీ20ల్లో రాణించలేకపోతున్నాడు. ఆసియా కప్‌లోనూ ఇతనికి ఆడే అవకాశాలొచ్చినా, తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక దినేశ్ కార్తీక్ విషయానికొస్తే.. మొన్న జరిగిన ఐపీఎల్ నుంచి ఇతను ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. తనకు అవకాశం లభించినప్పుడల్లా బ్యాట్‌ను ఝుళపించాడు. కీపర్‌గానూ అదరగొట్టాడు. కాకపోతే, ఇతనికి ఆసియా కప్‌లో ఆడేందుకు పెద్దగా అవకాశాలు రాలేదు. అవకాశాలొచ్చినా రిషభ్ పెద్దగా రాణించలేదు కాబట్టి.. ఈ ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలన్నది హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే చెతేశ్వర్ పుజారా పై విధంగా స్పందించాడు. అలాగే.. భువనేశ్వర్ కుమార్‌ని కూడా టీ20 వరల్డ్ కప్ తుది జట్టులో తీసుకోవాల్సిందేనని, అతడో టాప్ క్వాలిటీ బౌలర్ అని కితాబిచ్చాడు.

Exit mobile version