CSK vs GT: తక్కువ స్కోరుకే చెన్నై మటాష్.. గుజరాత్ టార్గెట్ 134
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిఫెండర్ ఛాంపియన్స్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ఏడాది ఐపీఎల్ ఎంత దారుణమైన పెర్ఫార్మెన్స్ కనబరుస్తుందో అందరూ చూస్తూనే ఉన్నారు. వరుస పరాజయాలతో ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకుంది. పోనీ.. మిగిలిన మ్యాచెస్‌లో అయిన తన బ్రాండ్‌కి తగినట్టు అదరగొడుతుందనుకుంటే, ఆ ఆశల్నీ నిరుగార్చేస్తోంది. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతోన్న మ్యాచ్‌లోనూ చెన్నై పెద్దగా రాణించలేదు.
వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 133 పరుగులే చేసింది. ఓపెనర్ రుతురాజ్ (49 బంతుల్లో 53 పరుగులు), నారాయణ్ జగదీశన్ (33 బంతుల్లో 39 పరుగులు)లు మాత్రమే నిలకడగా ఆడారు తప్ప.. మిగతా వాళ్ళందరూ నిరాశజనకమైన పెర్ఫార్మెన్స్‌లతో వెనుదిరిగారు. మోయీన్ అలీ (17 బంతుల్లో 21 పరుగులు) కాస్త పర్వాలేదనిపించాడు.
Also Read
- Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
- India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
- India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
గుజరాత్ బౌలింగ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌తో షమీ తన సత్తా చాటాడు. 4 ఓవర్లలో 19 పరుగులే ఇచ్చి, 2 కీలకమైన వికెట్లు పడగొట్టాడు. రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, సాయి కిశోర్‌లు చెరో వికెట్ తీసుకున్నారు. చెన్నై బ్యాట్స్మన్లకు బంతి అందకుండా.. కట్టడి చేయడంలో బౌలర్లు బాగానే సఫలమయ్యారు. మరి.. తన ముందున్న 133 టార్గెట్‌ని గుజరాత్ చేధిస్తుందా? లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ!
తాజావార్తలు
-
BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
-
Pakistan Cosmetics : హైదరాబాద్‌లో పాకిస్థాన్ కాస్మెటిక్స్ ముఠా గుట్టురట్టు
-
Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
-
Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!