NTV Telugu Site icon

CSK vs GT: తక్కువ స్కోరుకే చెన్నై మటాష్.. గుజరాత్ టార్గెట్ 134

Sck Vs Gt

Sck Vs Gt

డిఫెండర్ ఛాంపియన్స్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ఏడాది ఐపీఎల్ ఎంత దారుణమైన పెర్ఫార్మెన్స్ కనబరుస్తుందో అందరూ చూస్తూనే ఉన్నారు. వరుస పరాజయాలతో ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకుంది. పోనీ.. మిగిలిన మ్యాచెస్‌లో అయిన తన బ్రాండ్‌కి తగినట్టు అదరగొడుతుందనుకుంటే, ఆ ఆశల్నీ నిరుగార్చేస్తోంది. ఇప్పుడు గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడుతోన్న మ్యాచ్‌లోనూ చెన్నై పెద్దగా రాణించలేదు.

వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 133 పరుగులే చేసింది. ఓపెనర్ రుతురాజ్ (49 బంతుల్లో 53 పరుగులు), నారాయణ్ జగదీశన్ (33 బంతుల్లో 39 పరుగులు)లు మాత్రమే నిలకడగా ఆడారు తప్ప.. మిగతా వాళ్ళందరూ నిరాశజనకమైన పెర్ఫార్మెన్స్‌లతో వెనుదిరిగారు. మోయీన్ అలీ (17 బంతుల్లో 21 పరుగులు) కాస్త పర్వాలేదనిపించాడు.

గుజరాత్ బౌలింగ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌తో షమీ తన సత్తా చాటాడు. 4 ఓవర్లలో 19 పరుగులే ఇచ్చి, 2 కీలకమైన వికెట్లు పడగొట్టాడు. రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, సాయి కిశోర్‌లు చెరో వికెట్ తీసుకున్నారు. చెన్నై బ్యాట్స్మన్లకు బంతి అందకుండా.. కట్టడి చేయడంలో బౌలర్లు బాగానే సఫలమయ్యారు. మరి.. తన ముందున్న 133 టార్గెట్‌ని గుజరాత్ చేధిస్తుందా? లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ!