Site icon NTV Telugu

CSK vs KKR: సీఎస్కే తాండవం.. కేకేఆర్ ముందు భారీ లక్ష్యం

Csk 20 Overs Innings

Csk 20 Overs Innings

Chennai Super Kings Scored 235 Runs Against KKR: ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఊచకోత కోసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఏకంగా 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇది ఈ సీజన్‌లోనే హయ్యస్ట్ స్కోర్. కేకేఆర్ గెలుపొందాలంటే.. 20 ఓవర్లలో 236 పరుగులు చేయాలి. ఇది అతి భారీ లక్ష్యమనే చెప్పుకోవాలి. అజింక్యా రహానే (29 బంతుల్లో 71), శివమ్ దూబే (21 బంతుల్లో 50), డెవాన్ కాన్వే (40 బంతుల్లో 56) అర్థశతకాలతో చెలరేగడంతో పాటు రుతురాజ్ గైక్వాడ్ (35) మెరుపు ఇన్నింగ్స్ కారణంగా.. చెన్నై ఇంత భారీ స్కోరు చేయగలిగింది. చివర్లో రెండు బంతులు ఉన్నప్పుడు కెప్టెన్ ఎంఎస్ ధోనీ క్రీజులోకి వచ్చాడు కానీ, ఈసారి తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇవ్వలేకపోయాడు. నో బాల్ పుణ్యమా అని ఒక ఎక్స్‌ట్రా బంతి లభించినా.. ధోనీ దాన్ని సద్వినియోగ చేసుకోలేకపోయాడు. ఏదేమైనా.. ధోనీ మైదానంలో అడుగుపెట్టినప్పుడు మాత్రం మైదానం ఒక్కసారిగా హోరెత్తిపోయింది.

Poonch Attack: పూంచ్ ఘటన.. ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు ఉక్కు బుల్లెట్లను వాడారు..

తొలుత టాస్ గెలిచిన కేకేఆర్ జట్టు ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో.. చెన్నై బ్యాటింగ్‌కు దిగింది. ఎప్పట్లాగే ఈసారి కూడా ఓపెనర్లు రుతురాజ్, కాన్వే అద్భుత శుభారంభాన్ని అందించారు. వీళ్లిద్దరు ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన రహానే, శివమ్ దూబే.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఏం తిని గ్రౌండ్‌లో అడుగుపెట్టారో తెలీదు కానీ.. భారీ బౌండరీలతో కేకేఆర్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించారు. ఎలాంటి బంతులు వేసినా సరే.. వాటిని తమకు అనుకూలంగా మార్చుకొని బౌండరీ లైన్‌లను దాటించేశారు. రహానే అయితే ఈరోజు 360 డిగ్రీ ప్లేయర్‌గా చెలరేగిపోయి ఆడాడు. 29 బంతుల్లోనే 71 పరుగులు చేశాడంటే.. ఎలా కుమ్మేశాడో అర్థం చేసుకోవచ్చు. దూబే, రహానే ఉన్నంతవరకు వరకూ.. బంతి బౌండరీ అవతలే ఉంది. చివర్లో కేమియో ఇచ్చిన రవీంద్ర జడేజా కూడా రెండు సిక్సులు కొట్టి చమత్కరించాడు. ఇక కేకేఆర్ బౌలర్ల విషయానికొస్తే.. కుల్వాంత్ రెండు వికెట్లు తీయగా.. వరుణ్, సుయాశ్ శర్మ చెరో వికెట్ పడగొట్టారు. సుయాశ్ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ వేయగా.. మిగతా బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మరి.. 236 పరుగుల భారీ లక్ష్యాన్ని, కేకేఆర్ ఛేధిస్తుందా? హోమ్ గ్రౌండ్‌లో తన పరువు కాపాడుకుంటుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ!

RCB vs RR: పోరాడి ఓడిన రాజస్థాన్.. హోమ్‌గ్రౌండ్‌లో జెండా ఎగరేసిన ఆర్సీబీ

Exit mobile version