NTV Telugu Site icon

CSK vs LSG: ముగిసిన చెన్నై బ్యాటింగ్.. లక్నోకి భారీ లక్ష్యం

Chennai Super Kings Innings

Chennai Super Kings Innings

Chennai Super Kings Scored 217 Against LSG: ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఈ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (57), డెవాన్ కాన్వే (47) అద్భుత శుభారంభం ఇవ్వడం వల్లే.. చెన్నై ఇంత భారీ స్కోరు చేయగలిగింది. ఈ ఓపెనర్లు 9 ఓవర్లలో తొలి వికెట్‌కి ఏకంగా 110 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. క్రీజులో ఉన్నంతసేపు.. ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తూ, మైదానంలో పరుగుల వర్షం కురిపించారు. ప్రత్యర్థులు ఎలాంటి బంతులు వేసినా.. వాటిని తమకు అనుకూలంగా మార్చుకొని, ఎడాపెడా షాట్లతో ఎగబడ్డారు. అయితే.. రవి బిష్ణోయ్ ఈ జోడికి బ్రేక్ వేశాడు. 9.1 ఓవర్ల వద్ద రుతురాజ్ ఒక షాట్ కొట్టబోయి.. మార్క్ వుడ్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత వెంటనే కాన్వే కూడా పెవిలియన్ చేరారు.

Beautiful Lakes: ప్రపంచంలోని 10 అందమైన సరస్సులు

రుతురాజ్ పోయాక క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే కూడా కాసేపు మెరుపులు మెరుపించాడు. 16 బంతుల్లోనే 1 ఫోర్, 3 సిక్సుల సహాయంతో 27 పరుగులు చేశాడు. అంబటి రాయుడు సైతం 14 బంతుల్లోనే 2 ఫోర్లు 2 సిక్సులతో 27 వ్యక్తిగత స్కోర్‌తో విజృంభించాడు. ఇక చివర్లో ధోనీ కొట్టిన రెండు సిక్సులైతే.. ఈ మ్యాచ్‌కి హైలైట్ అని చెప్పుకోవాలి. క్రీజులోకి వచ్చిన తొలి రెండు బంతులని రెండు సిక్సులుగా మలిచాడు. రెండో సిక్స్ అయితే అద్భుతమనే చెప్పుకోవాలి. క్లిష్టమైన బంతి అయినప్పటికీ.. తన శక్తినంత కూడగట్టుకొని షాట్ కొట్టడంతో, అది చాలా పైకి ఎగిరి చివరికి ప్రేక్షకుల మధ్య పడింది. మూడో బంతిని కూడా సిక్స్‌గా మలిచేందుకు ప్రయత్నించాడు కానీ, అది నేరుగా ఫీల్డర్ చేతిలో క్యాచ్‌గా వెళ్లడంతో ధోనీ ఔటయ్యాడు. చివరి రెండు బంతులకు రెండు పరుగులే రావడంతో.. చెన్నై స్కోరు 217/7 గా నమోదైంది. ఇక లక్నో బౌలర్ల విషయానికొస్తే.. బిష్ణోయ్, మార్క్ వుడ్ తలా మూడు వికెట్లు తీసుకోగా, అవేశ్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు.

Wife Killed Husband: భర్తను చంపిన భార్య.. కోర్టు ఏం శిక్ష విధించిందో తెలుసా?