Site icon NTV Telugu

IPL 2022: భారీ స్కోర్లలో CSKదే రికార్డు.. రెండో స్థానం ఎవరిదంటే..?

Chennai Super Kings

Chennai Super Kings

ఐపీఎల్‌లో ఆదివారం రాత్రి చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు రెచ్చిపోయి ఆడింది. ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్ డెవాన్ కాన్వే ఫోర్లు, సిక్సులతో డీవై పాటిల్ మైదానాన్ని హోరెత్తించాడు. దీంతో చెన్నై జట్టు 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు అరుదైన రికార్డు నెలకొల్పింది. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు 200 ప్లస్ స్కోర్లు చేసిన జట్టుగా నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్‌లో ఇప్పటివరకు 23 సార్లు 200 పస్ల్ స్కోర్లు చేసింది.

ఈ జాబితాలో చెన్నై తర్వాతి స్థానంలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు 21 సార్లు 200 పరుగుల కంటే ఎక్కువ భారీ స్కోర్లు నమోదు చేసింది. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో పంజాబ్ కింగ్స్ (16 సార్లు), ముంబై ఇండియన్స్ (16 సార్లు), కోల్‌కతా నైట్‌రైడర్స్ (14సార్లు), రాజస్థాన్ రాయల్స్ (14 సార్లు), సన్‌రైజర్స్ హైదరాబాద్ (12సార్లు), ఢిల్లీ క్యాపిటల్స్ (10 సార్లు) ఉన్నాయి.

కాగా ఈ సీజన్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జాస్ బట్లర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బట్లర్ ఇప్పటివరకు 37 సిక్సులు కొట్టాడు. రసెల్ (27 సిక్సులు), లివింగ్ స్టోన్ (25 సిక్సులు), దినేష్ కార్తీక్ (21 సిక్సులు), హెట్‌మెయిర్ (21 సిక్సులు) తర్వాతి స్థానాల్లో నిలిచారు.

Cricket: బీసీసీఐపై యువరాజ్ సంచలన ఆరోపణలు

Exit mobile version