NTV Telugu Site icon

Chennai Super Kings: దయచేసి అతడ్ని తొలగించండి.. అతని వల్లే అనర్థాలు

Shivam Deshpande

Shivam Deshpande

Chennai Super Kings Fans Fires On Shivam Dube And Deshpande: ఆటగాళ్లందరికీ అన్ని రోజులు ఒకేలా ఉండవు. అప్పుడప్పుడు దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఎవరూ కావాలనే చెత్త ప్రదర్శన కనబర్చరు. ఆ సిట్యుయేషన్‌లో మెరుగ్గా రాణించలేకపోతారంతే! హేమాహేమీలు సైతం ఇలాంటి బ్యాడ్ సిట్యుయేషన్లను ఎదుర్కున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి.. ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన ఆయా ఆటగాళ్లను నిందించడం కరెక్ట్ కాదు. కానీ.. అభిమానులు ఇదంతా ఒప్పుకోరు కదా! ఎవరైనా సరిగ్గా రాణించకపోతే.. అతనిపై విమర్శనాస్త్రాలు సంధిస్తారు. ఇప్పుడు శివమ్ దూబే కూడా అభిమానుల తాపాన్ని ఎదుర్కోవలసి వస్తోంది. తన జిడ్డు బ్యాటింగ్‌తో.. చెన్నై సూపర్ కింగ్స్ ఓటమికి అతడు కారణమయ్యాడంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తదుపరి మ్యాచ్‌లో అతడ్ని తప్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

KKR vs PBKS : బాదుడే.. 10 ఓవర్లు పంజాబ్‌ స్కోరు ఎంతంటే..?

శుక్రవారం సాయంత్రం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో.. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు శివమ్ దూబే 18 బంతులు ఎదుర్కొని, కేవలం 19 పరుగులే చేశాడు. తన ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్క సిక్స్ మాత్రమే కొట్టాడు. అంతే.. మిగతా బంతులను ఇతడు వేస్ట్ చేశాడు. సీఎస్‌కే బ్యాటింగ్ ఇన్నింగ్స్ హుషారుగా సాగుతున్న సమయంలో.. శివమ్ దూబే దెబ్బకు కాస్త నెమ్మదించింది. భారీ షాట్లు ఆడేందుకు అతడు ప్రయత్నించలేదు. దీంతో.. శివమ్ వల్లే చెన్నై మ్యాచ్ ఓడిపోయిందంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివమ్ వల్లే జోరుమీదున్న గైక్వాడ్ తన మొమెంటమ్ కోల్పోయాడు, సెంచరీ చేజార్చుకున్నాడని నిందిస్తున్నాడు. ఐపీఎల్‌-2023 సీజన్‌లో సీఎస్‌కేకు ఆరంభ మ్యాచ్‌లోనే ఓటమి ఎదురైందని.. ఈ అనర్థాలన్నింటికీ శివమ్ కారణమని ట్రోల్ చేస్తున్నారు. దీంతో.. తదుపరి మ్యాచ్‌లో అతడ్ని తప్పించి, మంచి ప్లేయర్‌ని రంగంలోకి దింపాలని కోరుతున్నారు.

Aishwarya Rajinikanth: ఐశ్వర్య పిసినారి.. జీతం పెంచలేదు.. అందుకే దొంగతనం

ఇదే సమయంలో.. అంబటి రాయుడు స్థానంలో వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ తుషార్ దేవ్‌పాండేపై కూడా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అతడు నో బాల్స్ వేయడంతో పాటు ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో.. చెన్నై ఓటమికి అతడు కూడా కారకుడని విమర్శిస్తున్నారు. ఇతడు ఇంపాక్ట్ ప్లేయర్ చెన్నైకా? లేక గుజరాత్ టైటాన్స్‌కా? అంటూ ప్రశ్నిస్తున్నారు. కొత్త రూల్‌ కారణంగా.. ఈ మహానుభావుడిని ఆడించి, సీఎస్‌కే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. కాగా.. మ్యాచ్ అనంతరం తమ ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని ధోనీ చెప్పిన విషయం తెలిసిందే. అలాగే.. శివం దూబే తమకు ఆప్షన్‌ మాత్రనేనని కూడా తెలిపాడు.

Show comments