Bishnoi Gang: క్రికెట్‌లోకి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఎంట్రీ.. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ఫిక్సింగ్‌లో సంచలన విషయాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada T20 World Cup Fixing Scandal: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో కెనడా జట్టుకు సంబంధించిన ఫిక్సింగ్ కుంభకోణం బయటకు వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఇప్పటికే ఈ ఫిక్సింగ్‌పై విచారణ ప్రారంభించింది. ఇంతలో వెన్నులో వణుకు పుట్టించే అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వివాదంలో భారత్‌లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉందనే వార్తలు సంచలనం రేపుతున్నాయి. ఐసీసీ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) ప్రస్తుతం కెనడా కెప్టెన్ దిల్‌ప్రీత్ బాజ్వా ప్రమేయంపై దర్యాప్తు చేస్తోంది. కెనడియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (CBC) కథనం ప్రకారం.. కెనడా జట్టు కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా నియమకం వెనుక, అలాగే మ్యాచ్‌లను ఫిక్సింగ్ చేసే వ్యూహాల వెనుక ఈ గ్యాంగ్ హస్తం ఉందని తెలుస్తోంది.
READ MORE: Gayapadda Simham Exclusive: హ్యాపెనింగ్ హీరో ఎక్స్టెండెడ్ క్యామియో.. మరో సర్ప్రైజ్ కూడా!
Also Read
- Hockey World Cup 2026: మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత్ జోరు.. దక్షిణాఫ్రికాపై 6-1 ఘన విజయం
- Rishabh Pant Record: టెస్టుల్లో 100 సిక్సర్లు.. పంత్ పేరిట ప్రపంచ రికార్డు!
- IND vs SL 1st Test: గాలె టెస్ట్‌లో భారత్‌కు షాక్.. రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకే చేతులెత్తేశారు..
- Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
ఈ కుంభకోణం మూలాలు జూలై సర్రేలోని ఒక రెస్టారెంట్‌తో ముడిపడి ఉన్నాయి. గత జూలై (2025)లో ఓ ప్రధాన ప్రాంతీయ టోర్నమెంట్‌లో విజయం సాధించింది. తర్వాత సుమారు 25 మంది క్రికెటర్లు బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో ఓ రెస్టారెంట్‌లో సమావేశమయ్యారు. ఆ టోర్నమెంట్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు, కెనడా జాతీయ పురుషుల జట్టు స్టార్ ఆటగాడు భోజనం చేస్తున్న టేబుల్ వద్దకు వెళ్లారు. తాము బిష్ణోయ్ గ్యాంగ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకుంటూ.. దిల్‌ప్రీత్ బాజ్వా, మరో యువ ఆటగాడి ప్రోత్సాహానికి మద్దతు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ‘నోహ్’ అని పిలవబడే మరో వ్యక్తి కూడా ఈ గ్యాంగ్ నుంచి బెదిరింపులు ఎదుర్కొన్నాడు. తనను భయపెట్టేందుకు బిష్ణోయ్ ముఠా ఒక ఫోటోను మెసేజ్ చేసిందని, క్రికెట్ పరిపాలనలో, జట్టు ఎంపికలో తమకు అనుకూలమైన వ్యక్తులను ఉంచేందుకు తీవ్రంగా ప్రయత్నించారని నోహ్ వెల్లడించాడు.
READ MORE: Tim Cook: ఆపిల్ సీఈఓగా టిమ్ కుక్ రిటైర్మెంట్! ఆయన ఎన్ని వేల కోట్లకు అధిపతో తెలుసా?
వాస్తవానికి.. దిల్‌ప్రీత్ బజ్వా కెప్టెన్సీ ఎంపికే ఒక మిస్టరీగా మారింది. 2026 టీ20 వరల్డ్ కప్‌కు కేవలం కొన్ని వారాల ముందు వివాదాస్పద రీతిలో అతనికి పగ్గాలు అప్పగించారు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బజ్వా వేసిన ఒక ఖరీదైన, అసాధారణమైన ఓవర్‌పై ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్ (ACU) కన్ను పడింది. దీంతో అతని మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని అధికారులు విచారణ జరుపుతున్నారు. కేవలం ఆటగాళ్లపైనే కాకుండా, క్రికెట్ కెనడా ప్రెసిడెంట్ అరవిందర్ ఖోసాపై కూడా ఈ నివేదిక నీలినీడలు కమ్ముకునేలా చేసింది. ఖోసా తన పదవిలోకి రాకముందే బజ్వాను కెప్టెన్ చేయాలని ప్రతిపాదించారని, మ్యాచ్‌లు ఫిక్సింగ్ చేసి డబ్బు సంపాదించడమే ఈ గ్యాంగ్ ప్రధాన ఉద్దేశమని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను ప్రెసిడెంట్ ఖోసా కొట్టిపారేశారు. తన ప్రతిష్టను దెబ్బతీయడానికి జరుగుతున్న రాజకీయ కుట్రగా ఆయన అభివర్ణించారు.
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్‌తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్‌నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్‌జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!