Tim Cook: ఆపిల్ సీఈఓగా టిమ్ కుక్ రిటైర్మెంట్! ఆయన ఎన్ని వేల కోట్లకు అధిపతో తెలుసా?
- రూ. 27 వేల కోట్ల ఆస్తి..
- ఆపిల్‌తో 15 ఏళ్ల ప్రస్థానం..
- ఆపిల్ నూతన సారథిగా జాన్ టర్నస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tim Cook: ఆపిల్ కంపెనీలో ఒక శకం ముగియబోతోంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన టెక్ దిగ్గజాల్లో ఒకటిగా ఆపిల్‌ను తీర్చిదిద్దిన టిమ్ కుక్ తన సీఈఓ పదవి నుంచి తప్పుకోనున్నారు. ఆయన స్థానంలో జాన్ టర్నస్ ఆపిల్ నూతన సారథిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. టిమ్ కుక్ రిటైర్మెంట్ నేపథ్యంలో ఆయన ఎన్ని వేల కోట్లకు అధిపతో తెలుసా.. అలాగే ఆయన ప్రస్థానం ఆపిల్‌లో ఎప్పుడు ప్రారంభం అయ్యింది అనే వివరాలను ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Lady Super Star : రూటు మార్చిన లేడి సూపర్ స్టార్ ఒక వైపు సీనియర్.. మరో వైపు జూనియర్ హీరోలతో బిజీ
Also Read
- Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
- LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
- EPFO New Rules: అక్టోబర్ నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఉద్యోగి తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే!
- SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
టిమ్ కుక్ 1998లో ఆపిల్ కంపెనీలో చేరారు. అంతకుముందు ఆయన IBMలో 12 ఏళ్ల పాటు పనిచేశారు. ఆపిల్‌లో ఆయన తన స్టార్టింగ్ స్టేజ్‌లో ఆపరేషన్స్, సప్లై చైన్ విభాగంలో కెరీర్ ప్రారంభించి, తర్వాత చీఫ్ ఆపరేషనల్ ఆఫీసర్ స్థాయికి ఎదిగారు. 2011లో స్టీవ్ జాబ్స్ అనారోగ్య కారణాలతో తప్పుకున్న తర్వాత కుక్ ఆపిల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఆయన సుమారు 15 ఏళ్ల పాటు సీఈఓగా ఉండి, కంపెనీని 4 ట్రిలియన్ డాలర్ల సామ్రాజ్యంగా మార్చారు. ప్రస్తుతం ఆయన తన పదవి నుంచి తప్పుకున్నాక, కంపెనీలో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగే అవకాశం ఉందని సమాచారం.
టిమ్ కుక్ నికర ఆస్తుల విలువ ..
ఫోర్బ్స్ తాజా లెక్కల ప్రకారం.. టిమ్ కుక్ ఆస్తుల విలువ భారీగా పెరిగింది. ఆయన మొత్తం ఆస్తి విలువ సుమారు 2.9 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.27,124 కోట్లు అని అంచనా). కుక్ ఆస్తిలో మెజార్టీ భాగం ఆపిల్ షేర్ల రూపంలో ఉంది. ఆయన వద్ద 30 లక్షలకు పైగా ఆపిల్ షేర్లు ఉన్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో షేర్లు ఉన్నప్పటికీ, కంపెనీలో ఆయన వాటా కేవలం 1 శాతం మాత్రమే. గత కొన్ని ఏళ్లలో ఆయన మిలియన్ల డాలర్ల విలువైన షేర్లను విక్రయించి తన వ్యక్తిగత సంపదను పెంచుకున్నారు.
టిమ్ కుక్ హయాంలో ఆపిల్ సాధించిన ఆర్థిక విజయాలు అసాధారణమైనవి. 2011లో 350 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆపిల్ మార్కెట్ విలువ, ఇప్పుడు దాదాపు 4 ట్రిలియన్ డాలర్లకు చేరింది. అలాగే 2011లో కంపెనీ ఆదాయం 108 బిలియన్ డాలర్లు కాగా, 2025 నాటికి అది 416 బిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఆపిల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన సీఈఓగా టిమ్ కుక్ తనదైన ముద్ర వేసి, ఇప్పుడు ఆ వారసత్వాన్ని జాన్ టర్నస్‌కు అప్పగిస్తున్నారు.
తాజావార్తలు
-
Suma : నా స్క్రిప్ట్ లోనే దాచిపెట్టి దొంగదెబ్బ తీశారు! రాజమౌళి మాటలతో యాంకర్ సుమ ఎమోషనల్
-
Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
-
IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!