NTV Telugu Site icon

Pele Death: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు పీలే కన్నుమూత

Pele Death

Pele Death

Pele Death: ప్రముఖ ఫుట్‌బాల్ దిగ్గజం, బ్రెజిల్ మాజీ ఆటగాడు పీలే (82) మృతిచెందారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన సావో పాలోలోని ఐన్‌స్టీన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన మరణంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. పీలే బ్రెజిల్‌కు మూడుసార్లు ప్రపంచకప్ అందించారు. 1958, 1962, 1970లలో ఫిఫా ప్రపంచ కప్‌ను మూడుసార్లు గెలిపించిన ఏకైక ఆటగాడు పీలే. ఆయన బ్రెజిల్ తరఫున 92 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 77 గోల్స్ చేశారు. మొత్తం 1,363 మ్యాచ్‌లలో 1,281 గోల్స్ చేశారు. 2000లో ప్లేయర్ ఆఫ్ ది సెంచరీగానూ ఎంపికయ్యారు.

Read Also: Heeraben Modi Passed away: నరేంద్రమోడీకి మాతృ వియోగం.. మోడీ తల్లి హీరాబెన్ మోడీ మృతి

పీలే గోల్ సగటు ప్రతి మ్యాచ్‌కు 0.94గా నమోదైంది. ఇది ఫుట్‌బాల్ ప్రపంచంలో ఇప్పటికీ అత్యుత్తమంగా ఉంది. కాగా పీలే మరణ వార్తను ఆయన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి కుటుంబం ప్రకటించింది. పీలే మరణం ఫుట్‌బాల్ ప్రేమికులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. సోషల్ మీడియాలో అభిమానులు ఆయనకు చివరి వీడ్కోలు పలుకుతున్నారు. ఇటీవల ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌లో ఓటమి పాలైనప్పటికీ.. మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసి ఫ్రెంచ్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు కైలియన్ ఎంబాప్పే ట్వీట్ చేసి అతనికి నివాళులర్పించాడు. మరణవార్త తెలుసుకున్న మెస్సీ కూడా పీలే మరణానికి సంతాపం తెలిపారు.

Show comments