Ben Stokes: పాకిస్థాన్‌కు బెన్ స్టోక్స్ భారీ విరాళం.. ఎంత ఇచ్చాడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ben Stokes: ఇటీవల టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో తలపడిన ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్లు మరో సమరానికి సిద్ధమయ్యాయి. డిసెంబర్ 1 నుంచి ఈ రెండు జట్ల మధ్య పాకిస్థాన్ గడ్డపై మూడు టెస్టుల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్ చేరుకుని ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంటోంది. అయితే ఈ చారిత్రాత్మక టెస్టు సిరీస్ ముందే బెన్ స్టోక్స్ పాకిస్థాన్ ప్రజల మనసు దోచుకున్నాడు. ఈ టెస్ట్ సిరీస్ ద్వారా వచ్చే తన మ్యాచ్ ఫీజును మొత్తం పాకిస్తాన్‌లో ఈ ఏడాది వరద బాధితులకు అందజేయనున్నట్లు బెన్ స్టోక్స్ ప్రకటించాడు. వరదల కారణంగా దెబ్బతిన్న నగరాల పునర్ నిర్మాణం కోసం ఈ డబ్బును వాడుకోవాలని అతడు ట్వీట్ చేశాడు.
Read Also: Ms Dhoni: ధోని స్టెప్ వేస్తే మాస్.. ధోని కాలర్ మడతేస్తే మాస్.. అయ్యా మాస్
Also Read
- Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
- MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
- Shreyas Iyer: "ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం".. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
మరోవైపు ఈ టెస్ట్ సిరీస్ కోసం 17 తర్వాత తమ జట్టు పాకిస్థాన్‌కు రావడం ఎంతో సంతోషంగా ఉందని బెన్ స్టోక్స్ అన్నాడు. ఈ ఏడాది ఆరంభంలో పాకిస్థాన్‌లో వరదలు బీభత్సం సృష్టించాయని.. ఈ విపత్తు పాక్ ప్రజల జీవనాన్ని, దేశ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని అతడు తన ట్వీట్‌లో తెలిపాడు. క్రికెట్ తన జీవితానికి కావాల్సింది ఇచ్చిందని.. వాటిని తిరిగివ్వడం సరైందని తన భావన అని పేర్కొన్నాడు. అందుకే ఈ టెస్ట్ సిరీస్ ద్వారా తనకు లభించే మ్యాచ్ ఫీజు మొత్తాన్ని పాకిస్థాన్ వరద బాధిత సహాయ కేంద్రానికి అందజేయాలని నిర్ణయించుకున్నట్లు స్టోక్స్ పేర్కొన్నాడు. కాగా ఈ మూడు టెస్టుల సిరీస్ ద్వారా అతడు సుమారు రూ.37 లక్షల నగదును అందుకోనున్నాడు. ఈ మొత్తాన్ని పాకిస్థాన్ ప్రజలకు స్టోక్స్ విరాళంగా ఇవ్వనున్నాడు. డిసెంబర్ 1 నుంచి రావల్పిండిలో తొలి టెస్ట్, డిసెంబర్ 9 నుంచి ముల్తాన్‌లో రెండో టెస్టు, డిసెంబర్ 17 నుంచి కరాచీలో మూడో టెస్ట్ జరగనున్నాయి.
I’m donating my match fees from this Test series to the Pakistan Flood appeal ❤️🇵🇰 pic.twitter.com/BgvY0VQ2GG
— Ben Stokes (@benstokes38) November 28, 2022
తాజావార్తలు
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
ట్రెండింగ్
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!