NTV Telugu Site icon

BCCI: కీలక పదవుల్ని భర్తీ చేసేందుకు సిద్ధమైన బీసీసీఐ..

Bcci

Bcci

BCCI: బోర్డులో ఖాళీ అయిన కీలక పదవుల్ని భర్తీ చేసేందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి రెడీ అయింది. ఇందులో భాగంగా.. వచ్చే నెల 12న ముంబైలో ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఇక, బోర్డు కార్యదర్శిగా ఉన్న జై షా ఐసీసీ చైర్మన్‌గా వెళ్లగా.. కోశాధికారి ఆశిష్‌ షెలార్‌ మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. దీంతో కార్యదర్శి, కోశాధికారి పదవులు ఖాళీగా ఉన్నాయి. బోర్డు రూల్స్ ప్రకారం ఏదైన పదవి ఖాళైన 45 రోజుల్లోగా భర్తీ చేయాలి. ఇందుకోసం ఎస్‌జీఎమ్‌ నిర్వహించాలని ఉంది.

Read Also: Congress: జార్జ్‌ సోరోస్‌ను విందుకు ఆహ్వానించారన్న కేంద్ర మంత్రి.. శశి థరూర్‌ సీరియస్..!

ఇక, గురువారం నాడు జరిగిన బోర్డు ఉన్నతస్థాయి మీటింగ్ లో.. జనవరి 12వ తేదీన సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర క్రికెట్‌ సంఘాలకు బోర్డు అధికారి ఒకరు ఇప్పటికే సమాచారమిచ్చినట్లు తెలుస్తుంది. అయితే, మరో ఏడాది పదవీకాలం మిగిలి ఉన్నప్పటికీ జై షా, ఆశిష్‌లు తమ పదవులకు రిజైన్ చేశారు. దీంతో అస్సామ్‌కు చెందిన బోర్డు సంయుక్త కార్యదర్శి దేవజిత్‌ సైకియా ప్రస్తుతం బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శిగా కొనసాగుతుండగా.. కోశాధికారి పదవి బాధ్యతల్ని ఎవరికీ అప్పగించలేదు.

Show comments