Site icon NTV Telugu

ఐపీఎల్ 2022 ఇండియాలోనే అని ప్రకటించిన జైషా…

ఐపీఎల్ 2022 ఇండియా లోనే జరుగుతుందని బీసీసీఐ సెక్రటరీ జే షా ప్రకటించారు. అయితే తాజాగా చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో జై షా మాట్లాడుతూ.. ఇక్కడ చెపాక్‌ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడటం కోసం మీరంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. ఆ క్షణం ఎంతో దూరంలో లేదు, ఐపీఎల్ 15వ సీజన్ భారతదేశంలో జరుగుతుంది. అలాగే ఈ ఐపీఎల్ కొత్త జట్లు చేరడంతో మరింత ఉత్కంఠభరితంగా ఉంటుంది. అయితే ఈ ఐపీఎల్ కోసం జరిగే మెగా వేలం లో కొత్త కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడబోతున్నాం జై షా అన్నారు. అయితే కరోనా కారణంగా ఐపీఎల్ 2020 పూర్తిగా యూఏఈలో జరగగా… ఐపీఎల్ 2021 లో ఇండియాలోనే ప్రారంభం అయింది. కానీ తర్వాత కరోనా కారణంగా వాయిదా పడి రెండవ భాగం యూఏఈ వేదికగానే జరిగింది.

Exit mobile version