NTV Telugu Site icon

BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. మెన్‌ ఇన్‌ బ్లూతో సమానంగా మహిళా క్రికెటర్లకు వేతనాలు

Bcci

Bcci

BCCI: క్రికెట్‌ చరిత్రలో బీసీసీఐ సరికొత్త సంచలన నిర్ణయం తీసుకుంది. పే ఈక్విటీ పాలసీ పద్ధతిని ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకుంది. ఇకపై పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్‌ ఫీజ్‌ను ఇవ్వనుంది. క్రికెట్‌లో లింగసమానత్వం తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.

ఇకపై పురుషులు, మహిళా క్రికెటర్లకు సమాన వేతనాలు అందనున్నట్లు ప్రకటించింది. టెస్ట్‌ క్రికెట్‌కు రూ.15లక్షలు, వన్డేకు రూ.6లక్షలు, టీ20లకు రూ.3లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా తన ట్విటర్‌ వేదికగా ప్రకటించారు.