NTV Telugu Site icon

IND vs IRE: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Bcci Announces T20 Squad

Bcci Announces T20 Squad

ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోన్న భారత్.. ఇది ముగిసిన వెంటనే ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ ఆ సిరీస్‌కు భారత జట్టుని ప్రకటించింది. ఆ జట్టుకి హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గానూ, భువనేశ్వర్ కుమార్‌ను వైస్ కెప్టెన్‌గానూ నియమించింది. ప్రెజెంట్ దక్షిణాఫ్రికాతో తలపడుతున్న భారత్‌కి నాయకత్వ బాధ్యతలు చేపడుతోన్న రిషభ్ పంత్‌కు బ్రేక్ ఇచ్చారు. ఇక ఈ జట్టులో సంజూ శాంసన్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్‌కు చోటు దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

సంజూ చాలాకాలం నుంచి భారత జట్టులో చోటు సంపాదించడం కోసం ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే! అయితే.. అతడు స్థిరంగా ఫామ్‌ని కొనసాగించకపోవడంతో, ప్రతీసారి పక్కనపెడుతున్నారు. ఐపీఎల్ కాస్త పర్వాలేదనిపించే ప్రదర్శన కనబర్చినా, అతడ్ని సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలోనే క్రీడాభిమానుల దగ్గర నుంచి మాజీల దాకా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అతడో ప్రతిభ గల ఆటగాడు అయినప్పటికీ, ఎందుకు జట్టులో తీసుకోవడం లేదనే ప్రశ్నల వర్షం కురిశాయి. ఇప్పుడు ఐర్లాండ్ సిరీస్‌కి జట్టులో స్థానంలో కల్పించడంతో, ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంజూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటే, మున్ముందు మరిన్ని ఛాన్సెస్ రావడం ఖాయం.

ఐర్లాండ్ టీ20 సిరీస్‌కు భారత్ స్క్వాడ్:
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హూడా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయి, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.