Basit Ali Sensational Comments On Rahul Dravid: టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ద్రవిడ్‌కు తాను అభిమానినని, ఎప్పటికీ అతనికి అభిమానిగానే ఉంటానని, అతడొక లెజెండ్ అని చెప్తూ.. కోచ్‌గా మాత్రం అతడు జీరో అని కుండబద్దలు కొట్టాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో కోచ్‌గా ద్రవిడ్ విఫలమయ్యాడని, సరైన నిర్ణయాలు తీసుకోలేదని విరుచుకుపడ్డాడు. అసలు భారత్ ఎప్పుడైతే టాస్ గెలిచాక బౌలింగ్ ఎంపిక చేసుకుందో.. అప్పుడే టీమిండియా కోల్పోయిందని పేర్కొన్నాడు. తొలి రెండు గంటల పాటు ఓవర్లు వేసేందుకు ఇండియన్ బౌలర్లు తడబడ్డారని చెప్పాడు.
Rajinikanth – Amitabh: మెగా క్రేజీ కాంబో.. రజినీ సినిమాలో అమితాబ్ బచ్చన్?
అంతేకాదు.. టీమిండియా బౌలింగ్ ఐపీఎల్ తరహాలోనే ఉందని, లంచ్ బ్రేక్‌కల్లా తామే విజయం సాధించామన్నట్టుగా ఇండియన్ బౌలర్లు సంతోషంగా కనిపించారని బాసిత్ అలీ చెప్పాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో భారత జట్టు ఏదైనా అద్భుతాలు సృష్టిస్తే తప్ప.. ఈ మ్యాచ్ గెలవలేరని అన్నాడు. ఫీల్డింగ్‌లో కూడా భారత ఆటగాళ్లు అంత ఫిట్‌నెస్‌గా కనిపించలేదని.. రహానే, కోహ్లీ, జడేజా మినహాయించి మిగతా ప్లేయర్లు బాగా అలసిపోయినట్లుగా కనిపించారని చెప్పాడు. ‘‘భారత్‌లో టర్నింగ్ పిచ్‌లు తయారు చేయించారు. మరి, ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు అక్కడ అలాంటి పిచ్‌లే ఉన్నాయా? అక్కడ బౌన్సీ పిచ్‌లు ఉన్నాయా? ఆ దేవుడు మెదడు పంచుతున్నప్పుడు, ద్రవిక్ ఏ కొండల వెనకాల దాక్కునాడో ఏమో’’ అంటూ ద్రవిడ్‌పై అతడు విరుచుకుపడ్డాడు.
Petrol Rates: పెట్రోల్, డిజిల్ రేట్ల తగ్గింపు.. కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి ఏమన్నారంటే..
ఇదిలావుండగా.. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్ నాలుగో రోజుకి చేరుకున్న విషయం తెలిసిందే! రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు 270/8 స్కోరు వద్ద ఉండగా.. డిక్లేర్ ప్రకటించింది. దీంతో.. తొలి ఇన్నింగ్స్‌లో మిగిలిన పరుగులతో కలిపి భారత్ ముందు 444 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకే ఆలౌట్ అయిన భారత్.. అంత భారీ లక్ష్యాన్ని ఛేధించగలదా? తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన టాపార్డర్లు రాణిస్తే, ఆ లక్ష్యాన్ని ఛేధించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. మరి, భారత్ ఛేధిస్తుందో లేదో చూడాలి.