NTV Telugu Site icon

Babar Azam: బాబర్ ఆజంపై కొరడా.. కెప్టెన్సీ నుంచి తొలగింపు?

Babar Azam Captaincy

Babar Azam Captaincy

Babar Azam Set to be Replaced As Skipper Shan Masood: ప్రస్తుతం పాకిస్తాన్ జట్టుకి మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా ఉన్న బాబర్ ఆజమ్‌పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వేటు వేస్తోందా? అతడ్ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి, మరొకరిని కెప్టెన్‌గా రంగంలోకి దింపనుందా? అంటే, దాదాపు అవుననే పాకిస్తాన్ మీడియా కోడై కూస్తోంది. బాబర్‌ని కెప్టెన్‌గా దించేసి, అతని స్థానంలో మిడిలార్డర్‌ బ్యాటర్‌ షాన్‌ మసూద్‌కు పట్టం కట్టేందుకు పీసీబీ సర్వం సిద్ధమైందని తెలుస్తోంది. ఇదే సమయంలో.. వెటరన్‌ వికెట్‌కీపర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ను టెస్ట్‌ కెప్టెన్‌‌గా నియమించనున్నారనే ప్రచారమూ జరుగుతోంది. వన్డే, టీ20ల్లో షాన్‌ మసూద్‌కు.. టెస్టుల్లో సర్ఫరాజ్‌కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పాలని పాక్ బోర్డు ప్రణాళికలు చేస్తోందని జోరుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు.. మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను నియమించాలని ఆ దేశ క్రికెట్ విశ్లేషకులు ప్రతిపాదిస్తున్నారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన రాకపోయినా.. బాబర్‌ను కెప్టెన్‌గా దించేయాలన్న ఊహాగానాలు మాత్రం పాక్‌ క్రికెట్‌ సర్కిల్స్‌లో బాగా వినిపిస్తున్నాయి.

Harish Rao: బీజేపీని నమ్మి పార్టీలో చేరితే ఆత్మహత్య చేసుకున్నట్లే..

ఉన్నపళంగా పాక్ బోర్డు ఇలా ఆలోచించడానికి కారణం.. ఈమధ్య పాక్ జట్టు వరుస పరాజయాలు చవిచూడటమే! ఇటీవలి కాలంలో పాక్‌ స్వదేశంలో ఆడిన దాదాపు ప్రతి సిరీస్‌లో ఓటమిపాలైంది. తొలుత ఇంగ్లండ్ చేతిలో 0-3 తేడాతో వైట్ వాష్ అయ్యింది. ఇటీవల న్యూజీల్యాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 1-2 తేడాతో ఓటమిపాలైంది. అంతకుముందు అదే జట్టుతో జరిగిన టెస్ట్‌ సిరీస్‌ను అతికష్టం మీద డ్రా చేసింది. వరల్డ్‌ టెస్ట్‌ ఛాం‍పియన్‌షిప్‌ 2021-23లో భాగంగా స్వదేశంలో జరిగిన ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలోనే బాబర్‌ ఆజమ్‌పై వేటు అంశం తెరమీదకొచ్చింది.

Tamil Nadu: ప్రియుడి ఎదుటే కాలేజ్ విద్యార్థిపై గ్యాంగ్ రేప్..