NTV Telugu Site icon

Australia: వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా ట్రాక్ రికార్డ్ ఇదే..?

Aus

Aus

World Cup2023: వన్డే ప్రపంచ కప్ 2023 చివరి అంకానికి చేరుకుంది. రేపు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో టీమిండియా పోటీ పడుతుంది. 20 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియాలు ఫైనల్‌లో తలపడుతున్నాయి. ఆసీస్ ఐదుసార్లు టైటిల్ గెలుచుకోగా.. భారత్ రెండుసార్లు ట్రోఫీని గెలుచుకుంది. ఇక, ప్రపంచకప్ టోర్నీ 1975లో ప్రారంభం అయింది. ఇంగ్లండ్‌లో తొలిసారి ఈ ప్రపంచ కప్ టోర్నమెంట్ జరిగింది. 48 ఏళ్ల టోర్నీ చరిత్రలో ఆస్ట్రేలియా అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా నిలిచింది. ఈ వరల్డ్ కప్ లో బ్యాడ్ స్టార్ట్ తర్వాత ఆస్ట్రేలియా మళ్లీ లయను అందుకుంది. ఈ 13వ ఎడిషన్ లో టీమిండియా జరిగిన మ్యాచ్ మినహాయిస్తే.. వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల్లో కంగారుల జట్టు విజయం సాధించింది. సెమీస్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి నేరుగా ఆసీస్ ఫైనల్‌కు చేరుకుంది.

Read Also: Youngest Granny: అమ్మమ్మకు మళ్ళీ పెళ్లి.. అసలేం జరిగిందంటే..

ఇక, ఆస్ట్రేలియా జట్టు 1987, 1999, 2003, 2007తో పాటు 2015లో ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో వరుసగా మూడుసార్లు విజయం సాధించిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. అలన్ బోర్డర్, స్టీవ్ వా, రికీ పాంటింగ్ రెండుసార్లు, మైకేల్ క్లార్క్ కెప్టెన్సీలో ఒక్కసారి ఆస్ట్రేలియా ఛాంపియన్‌గా నిలిచింది. 2003 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించింది. దీంతో ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి భారత్‌కు ఇప్పుడు సువర్ణావకాశం.

ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ప్రయాణం ఇదే
1975- రన్నరప్
1979- గ్రూప్ స్టేజ్ నిష్క్రమణ
1983- గ్రూప్ స్టేజ్ నిష్క్రమణ
1987- విజేత
1992- రౌండ్-రాబిన్ దశ
1996- రన్నరప్
1999- విజేత
2003- విజేత
2007- విజేత
2011- క్వార్టర్ ఫైనల్స్
2015- విజేత
2019- సెమీ ఫైనల్స్
2023- ఫలితం రాలేదు..