Site icon NTV Telugu

లిఫ్టులో ఇరుక్కుపోయిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్‌కు వింత అనుభవం ఎదురైంది. మెల్‌బోర్న్‌లోని ఓ హోటల్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు బస చేస్తున్న సమయంలో… ఓ పని మీద బయటకు వెళ్లిన స్టీవ్ స్మిత్ ఓ లిఫ్టులో ఇరుక్కుపోయాడు. లిఫ్ట్ పనిచేయకపోవడంతో దాదాపు గంట సేపు స్మిత్ లిఫ్టులోనే ఉండిపోయాడు. ఈ విషయాన్ని స్వయంగా స్టీవ్ స్మిత్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

Read Also: ఓటమి ఎఫెక్ట్‌.. టెస్ట్‌ క్రికెట్‌కు స్టార్‌ ప్లేయర్‌ గుడ్‌బై

అయితే స్మిత్ లిఫ్టు లోపల ఇరుక్కుపోవడంతో తోటి క్రికెటర్ లబుషేన్ అతడికి కంపెనీ ఇచ్చాడు. డోర్ మధ్య గ్యాప్ ఉండటంతో.. తినడానికి స్నాక్స్ అందించాడు. లిఫ్టులో ఉన్నంత సేపు ఏం చేయాలో తెలియక స్టీవ్ స్మిత్ సోషల్ మీడియాలో వింత వింత పోస్టులు చేశాడు. 55 నిమిషాల తర్వాత లిఫ్ట్ టెక్నీషియన్ వచ్చి మరమ్మతులు చేసిన తర్వాత స్మిత్ బయటకు వచ్చాడు. మొత్తానికి స్మిత్ లిఫ్టు నుంచి బయటికి రావడంతో హోటల్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఇటీవల మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా జట్టు బాక్సింగ్ డే టెస్టులో పాల్గొంది. ఈ టెస్టులో ఇంగ్లండ్‌పై ఆసీస్ జట్టు ఘనవిజయం సాధించి యాషెస్ సిరీస్‌ను కైవసం చేసుకుంది.

Exit mobile version