Site icon NTV Telugu

IND vs AUS: టీమిండియాతో ఆడే ఆస్ట్రేలియా జట్టు ఇదే.. పాట్ కమ్మిన్స్ దూరం!

Aus

Aus

IND vs AUS: అక్టోబర్‌ 19వ తేదీ నుంచి భారత్ లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పర్యటించనుంది. ఇందులో భాగంగా ఇరు జట్లు మధ్య 3 వన్డేలు, 5 టీ20లు ఆడనున్నాయి. టీ20 మ్యాచ్‌లు అక్టోబర్‌ 29వ తేదీ నుంచి స్టార్ట్ కానున్నాయి. దీనికి సంబంధించి బీసీసీఐ ఇప్పటికే టీమిండియా తుది జట్టును ప్రకటించింది. తాజాగా తమ వన్డే, టీ20 స్వ్కాడ్‌ను ఆసీస్ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది.

Read Also: AP Politics : ఉదయం 11గంటలకు వైసీపీ నేతలతో జగన్‌ సమావేశం.

మరోవైపు, గాయం కారణంగా ఆసీస్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఈ సిరీస్‌కు దూరం అయ్యాడు. ఇటీవల నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడిన మ్యాక్స్‌వెల్‌ కూడా అందుబాటులో లేడు. ఇక, అతడు బిగ్‌ బాష్‌ లీగ్‌తో పునరాగమనం చేసే ఛాన్స్ ఉంది. అలాగే, ఆస్ట్రేలియా వరల్డ్‌ కప్‌ 2023 నెగ్గడంలో కీలకపాత్ర పోషించిన లబుషేన్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు జట్టు నుంచి తప్పించింది. అతడు ఫామ్‌లో లేకపోవడమే దీనికి ప్రధాన కారణం అని వెల్లడించింది.

Read Also: Singer Maithili Thakur: మోడీచే ప్రశంసలు.. ఇప్పుడు బీహార్ బీజేపీ మంతనాలు.. మైథిలి ఠాకూర్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమా?

వన్డే జట్టు: మిచ్‌ మార్ష్‌ (కెప్టెన్‌), ట్రావిస్‌ హెడ్‌, జోష్‌ ఇంగ్లిస్‌, అలెక్స్‌ కేరీ, కూపర్‌ కానెల్లీ, బెన్ డ్వార్షుయిస్, జేవియర్‌ బ్రాట్‌లెట్‌, నాథన్‌ ఎల్లిస్‌, కామెరూన్‌ గ్రీన్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌, మిచెల్‌ ఓవెన్‌, మాథ్యూ రెన్‌షా, మ్యాట్‌ షార్ట్‌, మిచెల్‌ స్టార్క్‌, ఆడమ్‌ జంపా.

టీ 20 జట్టు: మిచ్‌ మార్ష్‌ (కెప్టెన్‌), జోష్‌ ఇంగ్లిస్‌, మాథ్యూ కుహ్నెమాన్, సీన్ అబోట్, జేవియర్‌ బ్రాట్‌లెట్‌, టిమ్‌ డేవిడ్‌, బెన్ డ్వార్షుయిస్, నాథన్‌ ఎల్లిస్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌, ట్రావిస్‌ హెడ్‌, మిచెల్‌ ఓవెన్‌, మ్యాట్‌ షార్ట్‌, మార్కస్‌ స్టాయినిస్, ఆడం జంపా.

Exit mobile version