IND Vs AUS 3rd T20: హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ముందు భారీ స్కోరు నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు తొలి 5 ఓవర్లు, చివరి 5 ఓవర్లలో చెలరేగి ఆడింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 186 పరుగులు చేసింది. ఓపెనర్ కామెరూన్ గ్రీన్ 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. అతడు మొత్తం 52 పరుగులు చేసి వెనుతిరిగాడు. ఫించ్ 7, స్మిత్ 9, మ్యాక్స్‌వెల్ 6 పరుగులు చేసి అవుటయ్యారు. అయితే టిమ్ డేవిడ్ కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. అతడు 27 బంతుల్లో 54 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత భారీగా పరుగులు సమర్పించుకున్న బౌలర్లు.. ఆ తర్వాత గాడిలో పడి వికెట్లు తీశారు. అయితే చివర్లో మళ్లీ భారీ పరుగులు సమర్పించుకున్నారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3 వికెట్లు, చాహల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే 187 పరుగులు చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే వాళ్లే సిరీస్ కైవసం చేసుకుంటారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే టాపార్డర్ రాణించాల్సి ఉంది. రోహిత్, రాహుల్, కోహ్లీ బాధ్యతాయుతంగా ఆడితే గెలుపు కష్టమేమీ కాదు.
