Site icon NTV Telugu

ప్రతి జట్టులో ధోనీ లాంటోడు ఉండాలి.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ప్రశంసలు

జార్ఖండ్ డైనమైట్ మహేంద్రసింగ్ ధోనీ టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు కూడా అందించాడు. ఈ నేపథ్యంలో మహేంద్రసింగ్ ధోనీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ గ్రెగ్ ఛాపెల్ ప్రశంసలు కురిపించాడు. ప్రతి జట్టులోనూ ధోనీ లాంటోడు ఒకడు ఉండాలన్నాడు. సహజ వాతావరణంలో క్రికెట్ నేర్చుకున్న వాళ్లే ఎక్కువ కాలం క్రికెట్ ఆడగలుగుతారని.. అలాంటి వాళ్లలో ధోనీ ఒకడని కితాబినిచ్చాడు.

Read Also: వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు భారతజట్టు ఇదే..!!

ప్రస్తుతం అభివృద్ధి చెందిన క్రికెట్ దేశాలు క్రమంగా సహజ వాతావరణాన్ని కోల్పోతున్నాయని గ్రెస్ ఛాపెల్ ఆవేదన వ్యక్తం చేశాడు. యువ క్రికెటర్లు ఎదిగేది సహజ వాతావరణంలోనేనని, వాళ్లు ఆటగాళ్లను చూస్తూ కుటుంబ సభ్యులు, క్రికెటర్లతో సరదాగా గడుపుతూ ఆట నేర్చుకుంటారని గ్రెగ్ ఛాపెల్ అన్నాడు. భారత్‌లో మాత్రమే ఇలాంటి వాతావరణం ఉందని, అక్కడి వీధుల్లో, ఖాళీగా ఉండే పొలాల్లో ఎక్కువగా క్రికెట్ ఆడుతుంటారని, వాళ్లు సంప్రదాయ కోచింగ్ పద్ధతుల్ని పాటించరని పేర్కొన్నాడు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న టీమిండియా స్టార్లు అలా వచ్చినవారేనని, వారిలో ధోనీ ఒకడని గ్రెగ్ ఛాపెల్ అభిప్రాయపడ్డాడు. ధోనీ లాంటి ఆటగాళ్లు తగ్గిపోతుండం వల్లే అన్ని జట్లు ఇబ్బంది పడుతున్నాయని… ఇటీవల యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ దారుణ పరాభవానికి కారణాల్లో ఇది కూడా ఒకటన్నాడు.

Exit mobile version