Aus Vs Eng: ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లండ్‌కు వన్డే ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా చుక్కలు చూపించింది. మూడు వన్డేల సిరీస్‌లో ఆ జట్టును 3-0 తేడాతో వైట్ వాష్ చేసింది. విచిత్రం ఏంటంటే ఈ సిరీస్‌లో ఆడుతోంది టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టేనా అని చాలా మందికి అనుమానం వచ్చింది. అంత ఘోరంగా ఈ వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్ ప్రదర్శన చేసింది. ముఖ్యంగా మూడో వన్డేలో ఇంగ్లండ్ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. 364 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బట్లర్ సేనను 142 పరుగులకే ఆలౌట్ చేసింది. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ను ప్రేక్షకులు కూడా లైట్ తీసుకున్నారు. లక్ష సీట్ల సామర్థ్యం కలిగిన ఈ మైదానంలో కనీసం 10 వేల మంది కూడా ఈ మ్యాచ్‌కు హాజరు కాలేదు.
Read Also: IND Vs NZ: టీమిండియా అదుర్స్.. మూడో టీ20లో హ్యాట్రిక్ కాని హ్యాట్రిక్
కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా చెలరేగి ఆడింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్ ఇద్దరూ సెంచరీలు చేశారు. ట్రావిస్ హెడ్(130 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్స్‌లతో 152), డేవిడ్ వార్నర్(102 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 106) రాణించారు. ఈ సెంచరీతో వార్నర్ రెండున్నరేళ్ల నిరీక్షణకు తెరదించాడు. స్మిత్ 21, స్టాయినీస్ 12, మిచెల్ మార్ష్ 30, అలెక్స్ క్యారీ 12 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఒలీ స్టోన్ ఒక్కడే నాలుగు వికెట్లు తీయగా.. లియామ్ డాసన్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 31.4 ఓవర్లలో 142 పరుగులకు కుప్పకూలింది. జాసన్ రాయ్(33), జేమ్స్ విన్స్(22) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించగా.. ప్యాట్ కమిన్స్, సీన్ అబాట్ రెండేసి వికెట్లు సాధించారు. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు 48 ఓవర్లకు మ్యాచ్‌ను కుదించి ఆడించారు. 48 ఓవర్లలో 364 పరుగులుగా లక్ష్యంగా నిర్ణయించారు. కాగా ఈ మ్యాచ్‌లో సెంచరీ హీరో ట్రావిస్ హెడ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా.. డేవిడ్ వార్నర్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లభించింది.
