NTV Telugu Site icon

INDvsAUS Test: మెల్‌బోర్న్‌ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం.. 155 పరుగులకు భారత్‌ ఆలౌట్

Aus Ind

Aus Ind

IND vs AUS Test: మెల్‌బోర్న్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన నాలుగో టెస్టులో 184 ప‌రుగుల తేడాతో భారత జట్టు ఓడిపోయింది. 340 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా 155 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ టెస్టులోని రెండో ఇన్సింగ్స్ లో భారత్ తరపున యశస్వి జైస్వాల్ (84)తో పాటు రిషబ్ పంత్ (30) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 474 పరుగులు చేయగా.. భారత్ 369 రన్స్ చేసింది. ఇక, రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 234 పరుగులకు ఆలౌట్ అయింది.

Read Also: Dil Raju : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు భేటీ..

అయితే, ఆఖరి వరకు డ్రా కోసం టీమిండియా ప్రయత్నించింది.. అయినప్పటికీ ఆసీస్ బౌలర్లు అద్బుతంగా రాణించడంతో టీమిండియా ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి ఆస్ట్రేలియా టీమ్ దూసుకుపోయింది. కాగా, బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో నాలుగు టెస్టులో ఓడిన భారత్‌ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ టేబుల్‌లో 52.78 పర్సెంటేజీతో మూడో స్థానంలో కొనసాగుతుగా ఆసీస్ సెకండ్ ప్లేస్ తో సరి పెట్టుకుంది. ఇక, డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరే అవకాశాలు ఆస్ట్రేలియాకే ఎక్కువగా ఉన్నాయి.

Show comments